Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Worlds Oldest Twins Video: ప్రపంచ కవలల్లో అత్యంత వృద్ధులు వీరే..! చిన్నతనంలో విడిపోయిన తోబుట్టువులు..!(వీడియో)

Worlds Oldest Twins Video: ప్రపంచ కవలల్లో అత్యంత వృద్ధులు వీరే..! చిన్నతనంలో విడిపోయిన తోబుట్టువులు..!(వీడియో)

Anil kumar poka

|

Updated on: Sep 23, 2021 | 10:26 PM

: వీరు ఉమెనొ సుమియామ, కౌమె కొడమ. ఈ తోబుట్టువుల వయస్సు 107 ఏళ్ల 330 రోజులు. ప్రపంచంలోని అత్యంత వృద్ధులైన కవలలుగా జపాన్‌కు చెందిన ఈ అక్కాచెల్లెళ్లు గిన్నిస్‌ రికార్డు కెక్కారు.

: వీరు ఉమెనొ సుమియామ, కౌమె కొడమ. ఈ తోబుట్టువుల వయస్సు 107 ఏళ్ల 330 రోజులు. ప్రపంచంలోని అత్యంత వృద్ధులైన కవలలుగా జపాన్‌కు చెందిన ఈ అక్కాచెల్లెళ్లు గిన్నిస్‌ రికార్డు కెక్కారు. ఇప్పటి వరకు జపాన్‌కే చెందిన కిన్‌ నరిటా, జిన్‌ కానీ అనే కవలల పేరిట ఉన్న 107 ఏళ్ల 75 రోజుల రికార్డును ఈ సోదరీమణులు బద్దలు కొట్టారు.

జపాన్‌లోని షొడొషిమా దీవిలో 1913 నవంబర్‌ 5వ తేదీన జన్మించిన వీరు చిన్నతనంలోనే విడిపోయారు. దాదాపు 70 ఏళ్లు వచ్చే వరకు వేర్వేరు చోట్ల గడిపారు. అనంతరం ఇద్దరూ కలిసి తీర్థయాత్రలు చేశారు. ఎక్కువ రోజులు జీవించి, గత రికార్డులను బద్దలు కొట్టడంపై వీరిద్దరూ జోకులు వేస్తుంటారని కుటుంబసభ్యులు చెప్పారు. హాస్యం కలబోసిన సంభాషణల ద్వారా 1990ల నుంచి వీరు సెలబ్రిటీలుగా మారిపోయారు. అందరూ వీరిని కిన్‌–సన్, జిన్‌–సన్‌ అని ఆప్యాయంగా పిలుచుకుంటుంటారు. ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరు చోట్ల ఆరోగ్య కేంద్రాల్లో ఉంటున్నారు. వీరి ఘనతను ప్రశంసిస్తూ గిన్నిస్‌ సంస్థ కొత్త రికార్డు సర్టిఫికెట్లను ‘రెస్పెక్ట్‌ ఫర్‌ ది ఏజ్‌డ్‌ డే’సందర్భంగా మెయిల్‌ ద్వారా పంపించింది. 
మరిన్ని చదవండి ఇక్కడ : Payal Ghosh injured Video: నాపై యాసిడ్ , ఇనుప రాడ్లతో దాడి చేశారు.. నటి పాయల్ సంచలన వ్యాఖ్యలు..!(వీడియో)

 జాతిరత్నాలు డైరెక్టర్‌ దర్శకత్వంలో వెంకీమామ..! ఈ సారి ఓ రేంజ్ లో ఫన్ రిపీట్..(వీడియో)

 Online Gaming: ఆన్‌లైన్ గేమ్‌కు బానిసైన బాలుడు.. 19 లక్షలు సమర్పించుకున్నాడు..!(వీడియో)

 బెయిల్‌పై రాజ్‌కుంద్రా విడుదల పై శిల్పాశెట్టి..! మొదటి ఇన్‌స్టా పోస్ట్‌లో సంచలన కొటేషన్‌..(వీడియో)