Kim Jong Un: కిమ్ కవ్వింపు చర్య.. యురేనియం ప్లాంట్ ఫొటోస్ రిలీజ్

|

Sep 16, 2024 | 8:45 PM

అణ్వాయుధాల తయారీలో కీలకమైన యురేనియం శుద్ధీకరణ ప్లాంట్‌కు సంబంధించిన చిత్రాలను 2010 తర్వాత ఉత్తరకొరియా తొలిసారిగా విడుదల చేసింది. ఆ ప్లాంట్‌ను సందర్శించిన కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అణ్వాయుధాల సంఖ్యను భారీగా పెంచడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అమెరికా సహా మిత్ర దేశాలపై ఒత్తిడి పెంచేలా ఆ చిత్రాలను ఉత్తరకొరియా విడుదల చేసిందనే చర్చ జరుగుతోంది.

అణ్వాయుధాల తయారీలో కీలకమైన యురేనియం శుద్ధీకరణ ప్లాంట్‌కు సంబంధించిన చిత్రాలను 2010 తర్వాత ఉత్తరకొరియా తొలిసారిగా విడుదల చేసింది. ఆ ప్లాంట్‌ను సందర్శించిన కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అణ్వాయుధాల సంఖ్యను భారీగా పెంచడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అమెరికా సహా మిత్ర దేశాలపై ఒత్తిడి పెంచేలా ఆ చిత్రాలను ఉత్తరకొరియా విడుదల చేసిందనే చర్చ జరుగుతోంది. నిత్యం క్షిపణులు, శక్తిమంతమైన బాంబుల పరీక్షలతో కవ్వించే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి వార్తల్లోకెక్కారు. అణ్వాయుధాల తయారీలో కీలకమైన యురేనియం శుద్ధీకరణ ప్లాంట్‌ను సందర్శించి శత్రు దేశాలపై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. యురేనియం శుద్ధీకరణ ప్లాంట్‌కు కిమ్‌ వెళ్లిన చిత్రాలను ఉత్తరకొరియా అధికారిక మీడియా KCNA విడుదల చేసింది. అక్కడ కిమ్‌జోంగ్ ఉన్‌ శాస్త్రవేత్తలతో మాట్లాడుతున్నట్లు కనిపించింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సెల్ఫీ దిగాలంటేనే భయపడుతున్న రవీనా టండన్‌

Kaun Banega Crorepati: పవన్‌ కల్యాణ్‌పై ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో ప్రశ్న