నేపాల్‌ ప్రధాని ఓలి రాజీనామా.. సైనిక పాలన దిశగా?వీడియో

Updated on: Sep 10, 2025 | 1:26 PM

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. యువత హింసాత్మక ఆందోళనలకు దిగొచ్చిన కేపీ శర్మ ఓలీ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచన మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తనను సురక్షితంగా దేశం దాటించాలనే షరతు మీద ఆయన సైన్యం చెప్పింది చేసినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించింది.

సోషల్‌ మీడియాపై బ్యాన్‌ ఎత్తేసినప్పటికీ.. మంగళవారం కూడా ఆందోళనకారులు తమ నిరసనలు కొనసాగించారు. ఖాట్మండులోని అధ్యక్ష భవనంతో పాటు ప్రధాని ఓలీ నివాసం, కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. విధ్వంసం సృష్టించడంతో పాటు వాటికి నిప్పు పెట్టారు. అధ్యక్షుడు రామ్‌ చంద్ర పౌడెల్‌ ప్రైవేట్‌ నివాసంతో పాటు నేపాల్‌ కాంగ్రెస్‌ భవనం, పలువురు నేతల ఇళ్లనూ నిరసనకారులు వదల్లేదు. వరుసగా మంత్రులు రాజీనామా చేయడం.. హింసాత్మక ఆందోళనలు మరింత ఉధృతం కావడం, అదే సమయంలో సైన్యం ఒత్తిడితో ప్రధాని రాజీనామా చేసినట్లు సమాచారం. నేపాల్‌లో సైనిక పాలనా?.. లేకుంటే కొత్త ప్రధానిని ఎన్నుకుంటారా? అనే దానిపై స్పష్టత రావలసి ఉంది. నేపాల్‌లో రెండ్రోజుల క్రితం సోషల్‌ మీడియాపై బ్యాన్‌ ప్రకంపనలు సృష్టించింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. యువత సోమవారం చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దేశ రాజధాని ఖాట్మండుతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో 12 ఏళ్ల బాలుడు సహా 19 మంది మరణించారు. సుమారు 347 మంది గాయపడ్డారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అనేక చోట్ల ప్రభుత్వం.. సైన్యాన్ని మోహరించి, కర్ఫ్యూ విధించింది.

మరిన్ని వీడియోల కోసం :

జాగ్రత్త : కారు సన్‌రూఫ్‌ ఇలా వాడితే శిక్ష తప్పదంట!వీడియో

విశాఖపట్నంలో ఘనంగా మహాసిమెంట్స్‌ వార్షిక సమావేశం వీడియో

ఢిల్లీలో ఒక్కసారిగా కూలిన భవనం వీడియో

తురకపాలెం.. భయపడొద్దు.. నేనొచ్చా.. ఇక్కడే పల్లె నిద్ర చేస్తా వీడియో