456 సంచుల్లో దొరికిన మృతదేహాలు.. అసలు కథ ఏంటంటే ??

Updated on: Jan 12, 2026 | 5:12 PM

2026 FIFA వరల్డ్‌ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న మెక్సికో స్టేడియం సమీపంలో సంచుల్లో 456 మృతదేహాలు బయటపడటం కలకలం రేపింది. డ్రగ్ కార్టెల్స్ ప్రమేయంపై అనుమానాలున్నాయి. 1,30,000 మిస్సింగ్‌ కేసులతో దేశంలో భద్రతా ఆందోళనలు పెరిగాయి. వరల్డ్‌ కప్‌ భద్రతపై అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతుండగా, అధికారులు మాత్రం ఆటగాళ్లు, ప్రేక్షకులకు భద్రతకు హామీ ఇస్తున్నారు.

ఆరు నెలల్లో మెక్సికోలోని ఆ స్టేడియంలో ఫిఫా వరల్డ్‌ కప్‌ జరగనుంది. ప్రపంచం చూపు మొత్తం అటు వైపే ఉండబోతోంది. వేలాది మందితో అక్కడ కోలాహలం కనిపించనుంది. వీవీఐపీల రాక కోసం భారీ భద్రత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ లోపు సంచుల్లో మృతదేహాలు బయటపడటం కలవరపాటుకు గురి చేస్తోంది. స్టేడియం నిర్మాణ పనులు చేస్తుండగా శవాల సంచులు బయటపడుతున్నాయి. ఈ విషయం బయటకు రావడంతో భద్రతా ఆందోళనలు పెరుగుతున్నాయి. మొత్తం 456 మృతదేహాల అవశేషాలను అదీ సంచుల్లోనే గుర్తించారు. ఇందులో ఒక్క లాస్ అగుజాస్ ప్రాంతంలోనే 290 సంచులు బయటపడ్డాయి! 2025 నాటికి మెక్సికోలో 1,30,000 మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి. మెక్సికోలోని న్యూ జనరేషన్ అనే పేరున్న డ్రగ్‌ కార్టెల్‌ ఈ హత్యలు చేసినట్లు అంచనా వేస్తున్నారు. అయితే అధికారుల 2026 ఫిఫా వల్డ్‌ కప్‌ కోసం వచ్చే ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రతకు ముప్పేమీ లేదని అంటున్నారు. అయితే సంచుల్లో మృతదేహాలు బయటపడిన ఈ పరిస్థితుల్లో ఎస్టాడియో అక్రోన్ స్టేడియంలో వరల్డ్ కప్ నిర్వహించడంపై అంతర్జాతీయ సమాజం నుంచి ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి పరిణామానికి దారి తీస్తుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రిపబ్లిక్‌ డే పరేడ్‌.. పక్షుల కోసం ఇలా

ఇంటి నుంచే సైబర్‌ క్రైమ్‌ ఎఫ్‌ఐఆర్‌.. బాధితులకు అండగా ‘సీ-మిత్ర’ హెల్ప్‌ డెస్క్‌

లీటరు వంట నూనె 18 లక్షలు.. ఒక్క ట్రే గుడ్ల ధర 35 లక్షలు

రోడ్డుపై రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే దూసుకొచ్చిన ట్రైన్

ఇక్కడ ఆడాల్సిందే.. లేదంటే ఇంటికే బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్