న్యూయార్క్, న్యూజెర్సీలో మంచు తుఫాన్ తీవ్రత

Updated on: Dec 29, 2025 | 7:13 PM

అమెరికాను డెవిన్ మంచు తుఫాన్ వణికిస్తోంది. న్యూయార్క్, న్యూజెర్సీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మంచు ప్రభావంతో విమాన సర్వీసులు రద్దయ్యాయి, రహదారులు మూసుకుపోయాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

డెవిన్ వింటర్ స్ట్రోమ్ అమెరికాను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ మంచు తుఫాను కారణంగా న్యూయార్క్, న్యూజెర్సీ సహా పలు రాష్ట్రాలు గజగజలాడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. రహదారులు మంచుతో నిండిపోయి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంచు తుఫాను తీవ్రత కారణంగా న్యూయార్క్, న్యూజెర్సీతో పాటు లాంగ్ ఐలాండ్, కనెక్టికట్, పెన్సిల్వేనియా, ఉత్తర న్యూజెర్సీ ప్రాంతాలపై ఎక్కువ ప్రభావం పడింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బీ అలర్ట్‌.. వచ్చే రెండు రోజులూ వణుకే.. మరింత పడిపోనున్న ఉష్ణోగ్రతలు

గ్యాంగ్ స్టర్‌ నామినేషన్‌.. కట్టేసిన చేతులు ముఖానికి నల్లటి గుడ్డతో

చలి ఎఫెక్ట్.. చుక్కల్లో కూరగాయల ధరలు ఇప్పటికే కేజీ ధర సెంచరీ క్రాస్‌

వైభవంగా ముగిసిన మండల పూజ.. శరణుఘోషతో ప్రతిధ్వనించిన శబరిగిరులు

‘ధురందర్’ పాక్‌ ఆసిమ్ మునీర్‌కు వెన్నులో వణుకు