రూ. 8 కోట్ల లగ్జరీ నౌక.. ప్రారంభించిన నిమిషాల్లోనే సముద్రంలో మునక

Updated on: Sep 06, 2025 | 1:18 PM

టూరిస్టుల కోసం.. ఎంతో ప్రెస్టీజియస్ గా.. కోట్లు ఖర్చు చేసి తయారు చేసిన లగ్జరీ నౌక సముద్రంలో మునిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కొటి కాదు రెండు కోట్లు కాదు.. ఏకంగా 8 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి తయారు చేసిన షిప్.. లాంచ్ చేసిన నిమిషాల వ్యవధిలోనే సముద్రంలో మునిగిపోయింది. ఉత్తర తుర్కియే తీరంలో జరిగిన ఈ ఘటన విజువల్స్ భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

సెప్టెంబర్ 2 న జోంగుల్డాక్ తీరంలో దోల్స్ వెంటో అనే లగ్జరీ షిప్.. ప్రారంభించిన 15 నిమిషాలకే తీరానికి 24 మీటర్ల దూరంలో బోల్తా పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే కోస్ట్ గార్డులు, వైద్య సిబ్బంది వెంటనే షిప్పు దగ్గరకు చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. జోంగుల్డాక్‌ తీరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మెడ్‌ యిల్మాజ్‌ షిప్‌యార్డ్‌లో ఈ నౌకను ఏర్పాటుచేశారు. మంగళవారం కొంతమంది ప్రయాణికులు, సిబ్బందితో ఈ నౌక ప్రయాణం ప్రారంభమైంది. అయితే ప్రారంభమైన 15 నిమిషాల్లోనే అది సముద్రంలో మునిగిపోయింది. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు, సిబ్బంది బతుకుజీవుడా అంటూ నీళ్లలోకి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ తర్వాత సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. నౌక మునిగిపోతున్న నేపథ్యంలో దాని యజమాని, కెప్టెన్‌ నిరుత్సాహంతో ఉండిపోయాడు. ఆయన చేసేదేమీ లేక సముద్రంలో దూకి ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ఘటనలో అందరూ సురక్షితంగా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ నౌక మునిగిపోతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతుంది. షిప్ మునకకు కచ్చితమైన కారణాలు తెలియలేదు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. షిప్ నీళ్లలో స్థిరంగా నిలబడే సామర్థ్యంలో సమస్య కారణంగా పక్కకు ఒరిగి మునిగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Social Media: సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఉక్కుపాదం

గుడ్‌ న్యూస్‌.. హైదరాబాద్‌నుంచి యూరప్‌కి డైరెక్ట్‌ ఫ్లైట్‌

6 రోజుల్లో రూ.6 వేలు పెరిగిన పుత్తడి.. ఆల్‌టైం రికార్డ్ దిశగా అడుగులు

‘కల్లు కొట్టు కాడా..’ మార్కెట్లోకి నయా మాస్ మాసాలా సాంగ్! అదిరిపోయే రెస్పాన్స్!

ఇన్‌స్టాలో పరిచయం.. పార్టీ పేరుతో స్కెచ్‌.. బాత్రూమ్‌లోకి పడేసి.. అత్యాచారం?