వీళ్లకి ఇంకా పదవిపై ఆశ చావలేదా? 150 ఏళ్లు బతకటంపై పుతిన్-జిన్‌పింగ్ చర్చ
చైనా, రష్యా ఇరు దేశాధినేతల మధ్య అమరత్వం గురించి చర్చ నడిచిందా అంటే.. అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా సంస్థలు. వీరద్దరి మధ్య రహస్యంగా జరిగిన సంభాషణ కాస్త మైక్రోఫోన్ ద్వారా లీక్ కావటంతో వారిద్దరూ ఏకాంతంగా ఏం మాట్లాడుకున్కారనే విషయం బయటకి వచ్చింది. ఇప్పటికే ఇరు దేశాల అధ్యక్షులు.. ఏకఛత్రాధిపత్యంతో అతి పెద్ద దేశాలను అలవోకగా పాలిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వారు ఎక్కువ కాలం బతకడం, అమరత్వం గురించి మాట్లాడుకోవటం ఆసక్తికరంగా మారింది. డ్రాగన్ ఆర్మీ బీజింగ్‌లో తియాన్మేన్ స్క్వేర్ వద్ద ఆయుధ ప్రదర్శన నిర్వహించింది . దీన్ని వీక్షించేందుకు పుతిన్ , షి జిన్‌పింగ్ , ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సహా ఇతర దేశాల నాయకులు హాజరయ్యారు. చైనా.. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్‌పై గెలిచి.. 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బుధవారం నాడు డ్రాగన్ ఆర్మీ బీజింగ్‌లో తియానన్మేన్ స్క్వేర్ వద్ద ఆయుధ ప్రదర్శన నిర్వహించింది. దీన్ని వీక్షించేందుకు పుతిన్ , షి జిన్‌పింగ్ , ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సహా ఇతర దేశాల నాయకులు హాజరయ్యారు. మొత్తం 24 మందికి పైగా విదేశీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా పుతిన్, జిన్‌పింగ్ వేదిక వైపు నడిచి వచ్చారు. ఈ సమయంలో పుతిన్ మాట్లాడుతూ.. ‘బయోటెక్నాలజీ ఎంతో అభివృద్ధి సాధించింది దీనివల్ల మనిషి తన శరీరంలో పాడైన, వయసు పైబడిన అవయవాలను నిరంతరం మార్పిడి చేసుకుంటూ.. మనిషి తన ఆయుష్షును పెంచుకోవచ్చు. చివరకు అమరత్వం కూడా సాధించవచ్చు’ అన్నారు. అప్పుడు కెమెరాకు దూరంగా ఉన్న షి జిన్‌పింగ్ స్పందిస్తూ, ఈ శతాబ్దంలో మానవులు 150 సంవత్సరాల వరకు జీవించగలరని కొందరు అంచనా వేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అయితే వీరి పక్కనే నడుస్తున్న కిమ్‌కి వీరి సంభాషణ వినిపించిందా.. లేదా అనే విషయం తెలియలేదు. అయితే వీరి మధ్య జరిగిన ఈ సంభాషణ మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాకు అమర్చిన మైక్రోఫోన్ ద్వారా లైవ్ టెలికాస్ట్ అయిందని రాయిటర్స్ మీడియా తన కథనంలో చెప్పుకొచ్చింది. షీ జిన్‌పింగ్, పుతిన్ ఇద్దరి వయసు కూడా ఇప్పటికే 72 సంవత్సరాలు. వచ్చే ఎన్నికల్లోనూ తానే అధ్యక్షుడిగా ఉండేలా జిన్‌పింగ్ ఇప్పటికే రాజ్యాంగంలో మార్పులు చేసారు. అలాగే పుతిన్ కూడా ఇలానే రాజ్యాంగ సవరణ చేశారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య అమరత్వం గురించి ప్రస్తావన రావడం చూస్తే.. వీరికింకా పదవి మీద ఆశ చావలేదని అర్ధం అవుతుంది అంటున్నారు నెటిజనులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెలకు రూ.5.90 లక్షలు ఖర్చు చేసిన జంట.. నెటిజన్లు షాక్
కైలాసగిరి హిల్‌టాప్ పార్క్‌లో స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ రెడీ
అద్దెకు అమ్మమ్మ, తాతయ్యలు !! కాన్సెప్ట్ ఏంటీ
యూరియా కొరత.. అదుపు తప్పుతున్న రైతుల ఆగ్రహం
వైరల్ ఫీవర్స్‌తో పాటు, డెంగ్యూ కేసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

