ఆహారంగా రొట్టెముక్క.. కొద్దిగా అన్నం.. హమాస్ చెరలో జీవితం దుర్భరం

|

Nov 30, 2023 | 9:57 AM

ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన నాలుగు రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం సందర్భంగా హమాస్ చెర నుంచి విడుదలైన బందీలు చేదు జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. గత మూడు రోజుల్లో హమాస్ మొత్తం 58 మంది బందీలను విడిచిపెట్టింది. వీరిలో చాలామంది ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఉన్నారు. వీరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. అక్కడ ప్లాస్టిక్ కుర్చీలే మంచాలుగా వాడామనీ రొట్టెముక్క, కొద్దిగా అన్నమే ఆహారంగా పెట్టారనీ బాత్రూమ్‌కు వెళ్లాలంటే గంటలకొద్దీ క్యూలో వేచి చూసే పరిస్థితి అని అంటున్నారు.

ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన నాలుగు రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం సందర్భంగా హమాస్ చెర నుంచి విడుదలైన బందీలు చేదు జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. గత మూడు రోజుల్లో హమాస్ మొత్తం 58 మంది బందీలను విడిచిపెట్టింది. వీరిలో చాలామంది ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఉన్నారు. వీరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. అక్కడ ప్లాస్టిక్ కుర్చీలే మంచాలుగా వాడామనీ రొట్టెముక్క, కొద్దిగా అన్నమే ఆహారంగా పెట్టారనీ బాత్రూమ్‌కు వెళ్లాలంటే గంటలకొద్దీ క్యూలో వేచి చూసే పరిస్థితి అని అంటున్నారు. శుక్రవారం హమాస్ విడుదల చేసిన బందీల్లో ఓ మహిళ, ఆమె కజిన్, ఆంటీతోపాటు మరొకరు అనుభవించిన కష్టాలను ఆమె వెల్లడించారు. గత 50 రోజుల్లో వారు ఏడు కేజీల బరువు తగ్గారని వివరించారు. రిసెప్షన్ లాంటి ప్రాంతంలో కుర్చీలనే మంచాలుగా చేసుకుని నిద్రపోయేవారని తెలిపారు. బాత్రూములకు వెళ్లేందుకు గంటలకొద్దీ వేచి చూడాల్సి వచ్చేదని అన్నారు. బందీలుగా ఉన్న అందరూ బరువు తగ్గారని తెలిపారు. వారి చెరలో క్షణమొక యుగంగా గడిచిందని, రోజులు లెక్కపెట్టుకుని, ప్రాణాలు అరచేత పెట్టుకుని గడిపామని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోతకొచ్చిన పంటల్లో నక్కిన పులులు !! వణుకుతున్న కూలీలు !!

Daily Horoscope: ఆ రాశివారు ఈ రోజు చేసే ప్రతీ పనిలోనూ ఘన విజయం సాధిస్తారు

TOP 9 ET News: యుద్ధానికి దిగుతున్న బావ బామ్మర్దులు | ప్రభాస్ డబుల్ బొనాంజా

Amar: ఫ్రెండ్‌ లేద్.. ఏం లేద్‌.. యానిమల్‌గా మారిన అమర్

Naga Chaitanya: నా మనసును కదిలించింది.. సమంత పై చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్