World Kidney Cancer Day Video: వరల్డ్ కిడ్నీ క్యాన్సర్ డే .కిడ్నీ క్యాన్సర్ గురించి తెల్సుకోండి.(వీడియో)
World Kidney Cancer Day: కిడ్నీలు (మూత్రపిండాలు) మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. అవి సరిగా పనిచేయకపోతే ప్రాణానికి ముప్పు ఉంటుంది. కిడ్నీలు శరీరంలోని నీటి మొత్తాన్ని సమతుల్యం చేయడమే కాకుండా, శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి.
World Kidney Cancer Day: కిడ్నీలు (మూత్రపిండాలు) మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. అవి సరిగా పనిచేయకపోతే ప్రాణానికి ముప్పు ఉంటుంది. కిడ్నీలు శరీరంలోని నీటి మొత్తాన్ని సమతుల్యం చేయడమే కాకుండా, శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. రక్తాన్ని పెంచే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఒత్తిడిని నియంత్రించడానికి, ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి కిడ్నీలు సహాయపడతాయి. కిడ్నీల వైఫల్యం ప్రాణాంతకం అవుతుంది. ఈరోజు (జూన్ 17) ప్రపంచ కిడ్నీ క్యాన్సర్ దినోత్సవం. ఈ సందర్భంగా కిడ్నీలకు వచ్చే క్యాన్సర్ వ్యాధి.. దాని లక్షణాలు.. తీసుకోవలసిన జాగ్రత్తల గురించి నిపుణులు చెప్పిన విశేషాలు తెలుసుకుందాం.కిడ్నీ క్యాన్సర్ చాలా తీవ్రమైన వ్యాధి. ఇది మూత్రపిండ కణాలు క్యాంకర్లుగా మారి అసాధారణంగా పెరిగి కణితులను ఏర్పరచడం వల్ల వస్తుంది. డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు కిడ్నీ వ్యాధి బారినపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ప్రపంచంలో మూడవ అతిపెద్ద వజ్రం ఎక్కడంటే..?1,098 క్యారెట్ల వజ్రం..వైరల్ అవుతున్న వీడియో.Worlds Third Largest Diamond Video.