Israel War: హెచ్చరించిన అమెరికా.. దిగొచ్చిన ఇజ్రాయెల్‌.! వీడియో.

|

Apr 06, 2024 | 9:22 PM

అగ్రరాజ్యాధినేత ఆగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్‌.. యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో మానవతా సాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అందులో భాగంగా ఉత్తర గాజాలో కీలకమైన సరిహద్దును తిరిగి తెరుస్తున్నట్లు వెల్లడించింది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఈ మేరకు ప్రణాళికలను వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చలు జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకుంది ఇజ్రాయెల్‌ ప్రభుత్వం.

గాజాలో యుద్ధం, మానవతా సాయం అందిస్తున్న సిబ్బందిపై దాడి వంటి విషయాలపై నెతన్యాహు, బైడెన్ గురువారం చర్చించారు. సామాన్య పౌరులు, సహాయక సిబ్బంది రక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని బైడెన్ ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌కు సూచించారు. దీనిపైనే భవిష్యత్తులో తమ సహకారం ఆధారపడి ఉంటుందని హెచ్చరించారు. గాజాలో ఇజ్రాయెల్‌ వ్యవహరిస్తున్న తీరును గతకొంతకాలంగా అమెరికా విమర్శిస్తోంది. వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని సూచిస్తూనే… సైనిక సహాయం, దౌత్యపరమైన మద్దతును కొనసాగిస్తూ ఉంది. గాజాలో ఆహారం పంపిణీ చేస్తున్న వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌ స్వచ్ఛంద సంస్థ సహాయ సిబ్బందిపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటన తర్వాత అంతర్జాతీయ సమాజం నుంచి నెతన్యాహు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఉత్తర గాజాలోని ప్రజలంతా ఆకలి చావులకు దగ్గరలో ఉన్నారని ఐక్యరాజ్యసమితి ఇటీవలే హెచ్చరించింది. మారణహోమానికి దారితీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ న్యాయస్థానం తెలిపింది. కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చట్టబద్ధమైన డిమాండ్‌ నోటీసును జారీ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us on