ఊగిపోయిన భవనాలు.. జనం పరుగో పరుగు

Updated on: Oct 06, 2025 | 8:21 PM

జపాన్‌లో మరోసారి భారీ భూకంపం ప్రజలకు వణుకుపుట్టించింది. ఒక్కసారిగా తీవ్రమైన భూ ప్రకంపనలు సంభవించటంతో జనం భయబ్రాంతులకు గురయ్యారు. హోన్షు తూర్పు తీరానికి సమీపంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా భూమి కంపించడం ప్రారంభం కావటంతో..ఇళ్లు, ఆఫీస్‌లు, భవనాలలోని జనాలు ఒక్కసారిగా బయటకు పరుగులు పెట్టారు.

ప్రాణాలు చేతపట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. భూకంపం ధాటికి చాలా ప్రాంతాల్లో భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రదేశాల్లోని నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ప్రకారం రిక్టర్‌ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.0గా నమోదైనట్టు తెలుస్తోంది. భూమి నుంచి సుమారు 50 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్ర ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేశారు. భూకంపం వచ్చింది… తీర ప్రాంతంలో కావటంతో.. సముద్రం అల్లకల్లోలానికి గురైంది. తొలుత- సునామీ సంభవింవచవచ్చంటూ వార్తలొచ్చినా..అలాంటి హెచ్చరికలేవీ కూడా జారీ కాకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. భూకంపం ధాటికి భూకంపం ధాటికి పలు చోట్ల భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల పాక్షికంగా కూలిపోయాయి.భూగోళికంగా జపాన్ దేశం.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌ పరిధిలో క్రియాశీలక అగ్నిపర్వత జోన్‌లో ఉంది. ప్రపంచంలోనే అత్యధిక భూకంప నెట్‌వర్క్‌లో ఉన్న ఈ దేశంలో తరచూ 3 లేదా అంతకంటే తక్కువ తీవ్రతతో భూ ప్రకంపనలు వస్తూ ఉంటాయి. అయితే.. ఈసారి ఆరుకు పైగా తీవ్రతతో భూమి కంపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చియాసీడ్స్‌ ఇలా తిన్నారో.. అంతే సంగతులు !!

బంగాళాదుంప తొక్కలు పడేయకండి.. లాభాలు తెలిస్తే వదలరు!

చికున్‌ గున్యా.. ముప్పులో భారత్ !! మేలుకోకుంటే.. మునగటం ఖాయం

వామ్మో.. ఇన్నిరోజులూ ఆ మందుబాబులు తాగింది ఇదా

సీతాఫలం తింటే చర్మం మెరుస్తుందా..!