Israel: గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్ సైన్యం..
ఇజ్రాయెల్ సైనికులు మానవత్వం మంటగలిసేలా అమానవీయంగా ప్రవర్తించారు. తీవ్ర గాయాలపాలైన ఓ పాలస్తీనా పౌరుడిని మిలటరీ వాహనం బ్యానెట్‌కు కట్టేసి, చిన్నపాటి సందుల గుండా తీసుకెళ్లారు. ఈ ఘటన పాలస్తీనా వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ నగరంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటన విడుదల చేసింది.
ఇజ్రాయెల్ సైనికులు మానవత్వం మంటగలిసేలా అమానవీయంగా ప్రవర్తించారు. తీవ్ర గాయాలపాలైన ఓ పాలస్తీనా పౌరుడిని మిలటరీ వాహనం బ్యానెట్‌కు కట్టేసి, చిన్నపాటి సందుల గుండా తీసుకెళ్లారు. ఈ ఘటన పాలస్తీనా వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ నగరంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. తమ సైనికులు నిబంధనలను అతిక్రమించి ప్రవర్తించారని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. వెస్ట్‌బ్యాంక్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ చేపడుతుండగా.. మిలిటెంట్లకు, ఆర్మీకి మధ్య ఎదురుకాల్పులు జరిగాయని, ఈ క్రమంలోనే ఆ వ్యక్తికి గాయాలయ్యాయని, అతడిని పాలస్తీనా మిలిటెంట్‌గా అనుమానిస్తున్నామని ఆర్మీ తన ప్రకటనలో పేర్కొంది.
అయితే మిలటరీ ఉన్నతాధికారుల ఆదేశాలను, ఆపరేషన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ అనుమానితుడిని బలగాలు కట్టేసి తీసుకెళ్లడం సరికాదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పేర్కొంది. గాయాలపాలైన వ్యక్తిని చికిత్స కోసం పాలస్తీనియన్ రెడ్ క్రిసెంట్‌కు తరలించినట్లు తెలిపింది. ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. జెనిన్‌తోపాటు చుట్టుపక్కల శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ తరచూ దాడులకు పాల్పడుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.