గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్‌ దాడి..హమాస్ నేత మృతి

Updated on: Mar 28, 2025 | 10:49 AM

దక్షిణ గాజాలోని అతిపెద్ద ఆస్పత్రిపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. ఖాన్ యూనిస్‌ నగరంపై దాడిలో ఒకరు మృతి చెందగా, పదుల సంఖ్యలో రోగులు గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడి కారణంగా ఆస్పత్రిలోని సర్జికల్ భవనంలో మంటలు చెలరేగాయి. అటు నాజర్ ఆస్పత్రిపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధ్రువీకరించింది. ఆస్పత్రిలో హమాస్ మిలిటెంట్లు కార్యకలాపాలు సాగిస్తున్నారని, అందుకే దాడి చేసినట్లు తెలిపింది .

 గత 24 గంటల్లో గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 26 పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు 50 వేల మందికి పాలస్తీనియన్లు మృతిచెందారని గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇంకా 1.13 లక్షల మంది గాయపడినట్లు వివరించింది.ఆదివారం ఖాన్‌ యూనిస్‌ నగరంపై ఇజ్రాయెల్‌ నిర్వహించిన దాడిలో హమాస్‌ కీలక నేత సలాహ్‌ అల్‌ బర్దావీల్‌ మృతి చెందారు. ఆయనతో పాటు భార్య కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఖాన్‌ యూనిస్‌ శరణార్థి శిబిరంలో జన్మించిన బర్దావీల్‌, హమాస్‌ సీనియర్‌ నేత యాహ్యా సిన్వర్‌కు సన్నిహితుడు. హమాస్‌ రాజకీయ విభాగానికి నాయకుడు. ఇజ్రాయెల్‌ దాడుల్లో సిన్వర్, ముస్తాహాలు చనిపోయినప్పటి నుంచి బర్దావీలే హమాస్‌లో కీలకనేతగా ఉంటున్నారు.మరోవైపు గాజా నుంచి పాలస్తీనియన్లను తరలించేందుకు కొత్త డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. దీనికి ఆ దేశ మంత్రిమండలి సైతం శనివారం ఆమోదం తెలిపింది. గాజా నుంచి పాలస్తీనియన్లు జోర్డాన్, ఈజిప్టు దేశాలకు శాశ్వతంగా తరలివెళ్లాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించారు.

మరిన్ని వీడియోల కోసం :

ఏప్రిల్‌ 1 నుంచి UPI పేమెంట్స్‌ బంద్‌ వీడియో

ఈ కోతికి అల్లరే కాదు.. ప్రేమ కూడా ఎక్కువే..వీడియో

పెంపుడు కుక్కతో విమానం ఎక్కబోయిన మహిళ..సిబ్బంది అడ్డుకోవడంతో..!

పొదల్లో కనిపించిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు.. కొన్నాళ్లకు