Israel – Hezbollah: ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య యుద్ధమేఘాలు.! హెజ్‌బొల్లాకు ఇజ్రాయెల్‌ వార్నింగ్‌

|

Aug 02, 2024 | 4:50 PM

ఇజ్రాయెల్‌పై రాకెట్‌ దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది హెజ్‌బొల్లా. తాజాగా హెజ్‌బొల్లా ప్రయోగించిన రాకెట్‌ ఇజ్రాయెల్‌లోని ఫుట్‌బాల్‌ మైదానంలో పడటంతో అక్కడ ఆడుకుంటున్న 12 మంది చిన్నారులు చనిపోయారు. దాంతో ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు నెతన్యాహు లెబనాన్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించడంతో రెండు దేశాల మధ్య యుద్ధమేఘాలు ఆవరించాయి.

ఇజ్రాయెల్‌పై రాకెట్‌ దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది హెజ్‌బొల్లా. తాజాగా హెజ్‌బొల్లా ప్రయోగించిన రాకెట్‌ ఇజ్రాయెల్‌లోని ఫుట్‌బాల్‌ మైదానంలో పడటంతో అక్కడ ఆడుకుంటున్న 12 మంది చిన్నారులు చనిపోయారు. దాంతో ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు నెతన్యాహు లెబనాన్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించడంతో రెండు దేశాల మధ్య యుద్ధమేఘాలు ఆవరించాయి. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా సంస్థకు ఇరాన్‌ నుంచి సైనిక శిక్షణ, ఆయుధ సరఫరాయే కాకుండా సిరియా పాలకుల నుంచి సాయం అందుతోంది. లెబనాన్ లో రెండేళ్ల క్రితం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో 13 సీట్లు కూడా గెలిచింది. సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో అధ్యక్షుడు బషర్‌ తరఫున పోరాడటం వీరికి కలిసొచ్చింది. యుద్ధనైపుణ్యాలు, ఆయుధ ఉపయోగానికి సంబంధించి ఇరాన్‌ శిక్షణ ఇచ్చింది. హెజ్‌బొల్లాను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది.

హెజ్‌బొల్లా వద్ద లక్షకు పైగా రాకెట్లు ఉన్నట్లు అంచనా. వీటితో పాటు స్వల్పదూర క్షిపణులు కూడా ఉన్నాయి. సైనికశిక్షణ పొందిన లక్షమందికి పైగా వాలంటీర్లు ఉన్నారు. ఈ ఆయుధ పాటవం లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడి చేయకుండా నివారించేందుకేనని ఆ సంస్థ ప్రకటించింది. హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్‌ పూర్తిస్థాయిలో దాడులు చేస్తే పశ్చిమాసియా అగ్నిగుండంగా మారే ప్రమాదముంది. అయితే ఇరువర్గాలు ఆ స్థాయి యుద్ధాన్ని కోరుకోవడం లేదు. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు ఆపేవరకు రాకెట్‌ దాడులు కొనసాగిస్తామని హెజ్‌బొల్లా ప్రకటించింది. తమకు పెద్ద ప్రమాదం హెజ్‌బొల్లాతో ఉంటుందని ఇజ్రాయెల్‌ అనుమానిస్తోంది. గతంలో లెబనాన్‌పై ఐడీఎఫ్‌ దాడులను నిలువరించేందుకు హెజ్‌బొల్లా గెరిల్లా పోరాటం చేసింది. హమాస్‌తో వీలైనంత త్వరగా సంధి చేసుకొని.. ఆ తర్వాతే లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దృష్టి సారించనుందని అంతర్జాతీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.