Explainer: రాణి లేని రాజ్యం కారణం.. చైనానా ?? అమెరికానా ??

|

Aug 07, 2024 | 4:49 PM

బంగ్లాదేశ్ లో అశాంతికి కారణం ఏమిటి? కారకులు ఎవరు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ దేశంలో శాంతిభద్రతలు అదుపులోకి రావడం ముఖ్యం. కానీ.. అక్కడ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడానికి కారణాలు, కారకుల గురించి కూడా కచ్చితంగా తెలియాలి. ఎందుకంటే ఇది బంగ్లా భవితను ప్రభావితం చేసే అంశం. అలాగే ఆ దేశంతో స్నేహపూర్వక బంధాన్ని కనబరిచే మనపైనా ప్రభావం చూపించే అంశం.

బంగ్లాదేశ్ లో అశాంతికి కారణం ఏమిటి? కారకులు ఎవరు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ దేశంలో శాంతిభద్రతలు అదుపులోకి రావడం ముఖ్యం. కానీ.. అక్కడ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడానికి కారణాలు, కారకుల గురించి కూడా కచ్చితంగా తెలియాలి. ఎందుకంటే ఇది బంగ్లా భవితను ప్రభావితం చేసే అంశం. అలాగే ఆ దేశంతో స్నేహపూర్వక బంధాన్ని కనబరిచే మనపైనా ప్రభావం చూపించే అంశం. కొన్నాళ్లుగా విద్యార్థుల ఉద్యమాలు, ఆందోళనలు, హింసాత్మక ఘటనలతో బంగ్లాదేశ్ అట్టుడికిపోతోంది. ఫలితం.. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా. ఆఖరికి కట్టుబట్టలతో దేశం నుంచి పారిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఒకప్పుడు బంగ్లా రాజకీయాలను శాసించిన ఆమెకు ఈ దుస్థితి ఎందుకు ఎదురైంది? దీని వెనుక ఉన్నది ఎవరు? ఇప్పుడు హసీనా లేని బంగ్లాదేశ్ ఎలా ముందడుగు వేయబోతోంది? బంగ్లాదేశ్ లో అల్లర్లకు ప్రధాన కారణం.. ఆ దేశ స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు సర్కారీ కొలువుల్లో 30 శాతం కోటా అంశం. దీనివల్ల ప్రయోజనం పొందినవారిలో అధికారపార్టీ వారే ఎక్కువగా ఉండడంతో వివాదం చెలరేగింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా ఆరేళ్ల కిందట వీటిని రద్దు చేసింది. అయితే కిందటి నెలలో.. కోటా విషయంలో.. అక్కడి హైకోర్టు ఇచ్చిన తీర్పుతో.. విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కారు. దీనికి ప్రతిపక్షాలు గళం కలపడంతో.. ఆ దేశంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. ఆఖరికి సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్లను 5 శాతానికి తగ్గిస్తే కాని పరిస్థితులు కంట్రోల్లోకి రాలేదు. కానీ ఉద్యమకారుల వాయిస్ కాస్తా.. హసీనా రాజీనామాయే లక్ష్యంగా మారింది. దీనివల్ల పెద్ద ఎత్తున ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆఖరికి వందలాది మంది మృతి చెందారు. ఈ హింసాత్మక ఘటనలు ఆ దేశ ఆర్థిక భవితవ్యాన్ని దెబ్బకొట్టాయనే చెప్పాలి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: దేవర సాంగ్‌ కాపీ అంటూ దారుణంగా ట్రోల్స్

iSmart News: పైకప్పుకు కన్నం పెట్టి వైన్ షాపులో లూఠీ !!

 

Follow us on