India bans Chinese apps: 54 చైనా యాప్‌ల‌పై బ్యాన్‌.. ఈ యాప్స్ మీ మొబైల్‌లో ఉన్నాయా అయితే డేంజరే.. వీడియో

|

Feb 25, 2022 | 9:04 AM

దేశ భ‌ద్ర‌తకు ముప్పు ఉన్న నేప‌థ్యంలో 54 చైనా యాప్‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం వేటు వేసింది. నిషేధిత జాబితాలో స్వీట్ సెల్ఫీ హెడ్‌, బ్యూటీ కెమెరా-సెల్ఫీ కెమెరా, వివా వీడియో ఎడిట‌ర్‌, టెన్‌సెంట్ జీవ‌ర్‌, ఒన్‌మోజీ ఎరినా, యాప్ లాక్‌, డ్యుయ‌ల్ స్పేస్ లైట్ యాప్‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది.


54 china apps ban: దేశ భ‌ద్ర‌తకు ముప్పు ఉన్న నేప‌థ్యంలో 54 చైనా యాప్‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం వేటు వేసింది. నిషేధిత జాబితాలో స్వీట్ సెల్ఫీ హెడ్‌, బ్యూటీ కెమెరా-సెల్ఫీ కెమెరా, వివా వీడియో ఎడిట‌ర్‌, టెన్‌సెంట్ జీవ‌ర్‌, ఒన్‌మోజీ ఎరినా, యాప్ లాక్‌, డ్యుయ‌ల్ స్పేస్ లైట్ యాప్‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ‌త ఏడాది జూన్‌లో చైనాకు చెందిన 59 మొబైల్ అప్లికేష‌న్ల‌ను బ్యాన్ చేసిన విష‌యం తెలిసిందే. వాటిల్లో పాపుల‌ర్ యాప్‌లైన టిక్‌టాక్‌, వీచాట్, హ‌లో కూడా ఉన్నాయి. జాతీయ భ‌ద్ర‌త‌కు, సార్వ‌భౌమాధికారానికి ముప్పు ఉన్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. 2020 మేలో చైనాతో స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ మొద‌లైన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు 300 యాప్‌ల‌ను నిషేధించారు. గాల్వాన్ ఘ‌ర్ష‌ణ త‌ర్వాత ఆ ఏడాది జూన్‌లో తొలిసారి చైనీస్ యాప్‌ల‌ను బ్యాన్ చేశారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..