ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష జరిపారు. ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం నిర్వహించారు. తాజా పరిస్థితుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అన్ని విభాగాల అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. మాక్ డ్రిల్ ను సీఎం రేవంత్ స్వయంగా పరివేక్షించనున్నారు. ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. తక్షణమే హైదరాబాద్ బయలుదేరి రావాలని సూచించారు. మాక్ డ్రిల్ ను పరివేక్షించాలని భట్టికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. 1971 తర్వాత తొలిసారి దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. మెట్రో నగరాల్లో ఎయిర్ సైరన్లు ఏర్పాటు చేశారు. 54 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలి అనే దానిపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. మంటలు ఎలా ఆర్పాలి, గాయపడిన వారిని ఎలా తరలించాలి, ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలి అనే దానిపై ఈ రిహార్సల్స్ చేపట్టారు.