డీజిల్ స్మగ్లింగ్ నౌక ను సీజ్ చేసిన ఇరాన్ !! భారతీయులు అరెస్ట్
ఇరాన్ ఒమన్ గల్ఫ్‌లో అక్రమ డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్న నౌకను సీజ్ చేసింది. తక్కువ ధరలకు చమురును తరలించి లాభాలు గడించే ప్రయత్నాలను అడ్డుకుంది. ఈ నౌకలో భారతీయులతో సహా 18 మంది సిబ్బంది ఉన్నారు. చమురు అక్రమ రవాణా వల్ల గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్ ఇలాంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి తనిఖీలను ముమ్మరం చేస్తోంది.
గల్ఫ్ ఆఫ్ ఒమన్ జలాల్లో అక్రమ డీజిల్‌ను తరలిస్తున్న ఒక నౌకను ఇరాన్ సీజ్ చేసింది. చమురు ధరలు తక్కువగా ఉన్న ఇరాన్ నుంచి అక్రమంగా చమురును తరలించి లాభాలు గడించే ప్రయత్నాలను తిప్పికొట్టింది. సీజ్ చేసిన ఆ నౌకలో భారతీయులతో సహా బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలకు చెందిన 18 మంది సిబ్బంది ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. సీజ్ చేసిన నౌక సిబ్బందిని ఇరాన్ అధికారులు ఎక్కడికి తరలించారు, వారి విడుదలపై ఇతర సమాచారం తెలియాల్సి ఉంది. చమురు ఎగుమతి చేసే దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇరాన్‌లో చమురు ధరలు చాలా తక్కువ. ధరల వ్యత్యాసాన్ని ఆసరాగా తీసుకుని.. కొందరు వ్యాపారులు ఇరాన్ నుంచి చమురును అక్రమంగా ఇతర దేశాలకు తరలించి, లాభాలు సంపాదిస్తున్నారు. అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఇరాన్ అధికారులు గల్ఫ్ ప్రాంతంలో తనిఖీలను చేస్తూ అక్రమ చమురు రవాణా నౌకలను సీజ్ చేస్తున్నారు. ఇరాన్ గతంలో కూడా అక్రమంగా ఇంధనం రవాణా చేసిన నౌకలను అడ్డుకుంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఇరాన్ ఈ చర్య తీసుకున్న రెండు రోజులకే.. వెనెజువెలా తీరంలో అమెరికా కూడా ఒక ఆయిల్ ట్యాంకర్‌ను సీజ్ చేసింది. ఆ నౌక కెప్టెన్.. వెనెజువెలా, ఇరాన్ నుంచి అక్రమంగా చమురు రవాణా చేస్తున్నాడనే ఆరోపణలతో అమెరికా ఆ నౌకను అడ్డుకుంది. మొత్తంగా ఈ అక్రమ చమురు రవాణా కార్యకలాపాల కారణంగా గల్ఫ్ ప్రాంతంలో, అంతర్జాతీయ జలాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్… కాశీ తర్వాత ఇక్కడే…
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ.. వైరల్ అవ్వడం కోసం మరీ ఇలా చేస్తావా ??