కేవలం రూ.100కే ఇల్లు.. ఎక్కడో తెలుసా? వీడియో

Updated on: Jul 29, 2025 | 9:59 PM

ఎప్పటికైనా సొంతిల్లు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికీ ఆశ ఉంటుంది. తాము కలలుకనే నివాసం తక్కువ ధరకే.. అదీ కూడా విదేశాల్లో సొంతమయితే! ఇంకేముంది ఎగిరి గంతేస్తారు. ఇలా సొంతింటి కోసం కలలు కంటున్న ప్రజల కోసం ఫ్రాన్స్‌ ఓ సూపర్‌ ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఆ దేశంలోని అంబర్ట్‌ అనే పట్టణంలో కేవలం ఒక్క యూరో.. అంటే మన కరెన్సీలో 100 రూపాయలు చెల్లించి.. ఇల్లు సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

ఫ్రాన్స్‌లోని పుయ్-డి-డోమ్ ప్రాంతంలోని ప్రశాంతమైన పట్టణం అంబర్ట్‌లో రోజురోజుకు తగ్గిపోతున్న జనాభాను పునరుద్ధరించేందుకు ఈ వినూత్న ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మెరుగైన మౌలిక సదుపాయాల కోసం ప్రజలు నగరాల వైపు తరలివెళ్లడంతో 19వ శతాబ్దం నుంచి ఈ ప్రాంతంలో జనాభా తగ్గుతూ వస్తోందట. ప్రస్తుతం ఈ పట్టణంలో 6,500 మంది నివసిస్తున్నారు. జనాభాను మరింత పెంచడానికి అక్కడి అధికారులు ఐదేళ్ల ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగానే ప్రజలకు 100 రూపాయలకే ఇళ్లు కొనుగోలు చేసే బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నారు. జనాభా సంఖ్యను పెంచడం, స్థానిక పాఠశాలలు, వ్యాపారాలు వంటి వాటిని అభివృద్ధి చేయడం.. ఇలాంటి లక్ష్యాలతో ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఇళ్ల కొనుగోలుకు కేవలం వంద రూపాయలు మాత్రమే అవుతున్నప్పటికీ.. శతాబ్దాల నాటి అక్కడి భవనాలను పునరుద్ధరించడానికి దాదాపు 20 నుంచి రూ.50 లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంటిని కొనుగోలు చేసే సమయంలోనే కొనుగోలుదారులు ఆ ఇంటి పునరుద్ధరణకు కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ.. హామీ ఇవ్వాల్సి ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం :

లైవ్‌ కవరేజ్ చేస్తూ.. వరదలో కొట్టుకుపోయిన జర్నలిస్ట్‌ వీడియో

కోళ్ల షెడ్డుకు వేసిన ఫెన్సింగ్‌ నుంచి వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూస్తే వీడియో

ఇదెక్కడి చోద్యం.. ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్న బ్రదర్స్ వీడియో

నదిలో ఉండాల్సిన మొసలి.. రోడ్డుపైకి రావడంతో.. వీడియో