మస్క్‌ పై యువతితో వలపు వల.. బయటపడ్డ పుతిన్‌ సీక్రెట్‌ ఆపరేషన్‌

Updated on: May 22, 2025 | 5:19 PM

సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యుద్ధం ప్రారంభంలో రహస్యాలన్నీ తెలుసుకునేందుకు అపో కుబేరుడు ఎలాన్ మస్క్ పై రష్యా యువతతో వలపోవల విసిరినట్లు మాజీ ఎఫ్ బిఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఏజెంట్ జోనాథన్ బౌమా సంచలన వ్యాఖ్యలు చేశారు. జర్మన్ బ్రాడ్ కాస్టర్ జెడ్డిఎఫ్ తీసుకున్న డాక్యుమెంటరీలో జోనాథన్ బౌమా మాట్లాడారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధానికి సమయం అని రహస్య సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారు.

ఇందులో భాగంగా రష్యా ఇంటెలిజెన్స్ సాయంతో ఎలాన్ మస్క్ పేపాల్ వ్యవస్థాపకుడు పీటర్ థీల్ పై ఓ యువతిని ప్రయోగించారు. మస్క్ కు ఉన్న జూదం, మత్తు పదార్థాల వినియోగాల లాంటి వీక్ నెస్ ను అడ్డం పెట్టుకొని యుద్ధం సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు. ఇక మస్క్ పీటర్ థీల్ పై జరిగిన ఈ సీక్రెట్ ఆపరేషన్ పుతిన్ కనుసన్నల్లోనే జరిగింది. పుతిన్ అనుమతి లేకుండా స్పై చేయరు కదా అని జోనాథన్ బౌమా అన్నారు. అయితే రష్యా జరిపిన సీక్రెట్ ఆపరేషన్లో మస్క్ పీటర్ థీల్ చిక్కుకున్నారా లేదా అనే విషయాలన్నీ చెప్పేందుకు జోనాథన్ బౌమా ఇష్టపడలేదు. కాగా ఎఫ్ బి ఐ లో 16 ఏళ్లు పనిచేసిన జోనాథన్ బౌమా ఓ మీడియా సంస్థకు రహస్య సమాచారాన్ని అందించారు. దీంతో అమెరికా ప్రభుత్వం జోనాథన్ బౌమాను అరెస్ట్ చేసింది. చివరికి లక్ష డాలర్లు పూచీకత్తో బెయిల్ పై విడుదలయ్యారు.

మరిన్ని వీడియోల కోసం :

ఓల్డ్‌సిటీ అగ్నిప్రమాదంలో గుండెలు బద్దలయ్యే వివరాలు వీడియో

మూడో ప్రపంచయుద్ధమే వస్తే .. ఈ దేశాలు సేఫేనా?వీడియో

51 రోజులు.. 1,000 కి.మీ.. శ్రీలంక మీదుగా ఆంధ్రాకు వీడియో

Published on: May 22, 2025 05:18 PM