ప్రాణం తీసిన వాటర్ హీటర్.. వేడినీళ్లు పెట్టుకుంటుండగా..
ఢిల్లీలో వాటర్ హీటర్ షాక్‌తో 23 ఏళ్ల యువతి మరణం, శీతాకాలంలో భద్రతా చర్యల ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. ఐఎస్‌ఐ మార్క్ గల హీటర్లు వాడటం, కాయిల్ పూర్తిగా మునిగేలా చూడటం, ప్లాస్టిక్ బకెట్లలో చెక్క సపోర్ట్ వాడటం వంటివి తప్పనిసరి. విద్యుత్ షాక్ ప్రమాదాల నుండి ప్రాణాలను రక్షించుకోవడానికి సరైన వినియోగంపై అవగాహన ముఖ్యం.
స్నానం కోసం ఎలక్ట్రిక్ వాటర్ హీటర్‌తో నీళ్లు వేడి చేసుకుంటుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ 23 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. ఢిల్లీ లోని మహిపాల్‌పూర్ లో ఈ ఘటన జరిగింది. చేతికి హీటర్ తగలడంతో ఆమె బాత్రూమ్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. బాత్రూమ్‌లోకి వెళ్లిన యువతి ఎంతకూ బయటికి రాకపోవడంతో ఆమె స్నేహితురాలు తలుపులు నెట్టి చూసింది. లోపలి నుంచి గడియ వేసి ఉండటం, ఎంత పిలిచినా పలుక కపోవడంతో అనుమానించిన ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చి తలుపు బద్దలు కొట్టి చూడగా.. చేతిలో హీటర్ పట్టుకుని విగతజీవిగా పడి ఉంది. మృతురాలు మణిపూర్‌కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. విద్యుత్ షాక్‌తోనే యువతి చనిపోయినట్లు తాము ప్రాథమిక అంచనాకు వచ్చామని ఇందులో కుట్ర కోణం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. శీతాకాలం వచ్చేసింది. అందరి ఇళ్లల్లో వాటర్ హీటర్ వాడకం మొదలవుతుంది. ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఐఎస్‌ఐ మార్క్ ఉన్నవి, బ్రాండెడ్ కంపెనీలవే కొనాలి. హీటర్ కాయిల్స్ పైన ఉండే సిలికా కోటింగ్.. రెండేళ్ల తర్వాత తొలగిపోతూ ఉంటుంది. అప్పుడు కొత్తది తెచ్చుకోవాలి. కొంతమంది ప్లాస్టిక్ బకెట్లలో హీటర్ పెడుతుంటారు. నేరుగా బకెట్‌కు హీటర్ హుక్‌ను తగిలించకూడదు. ఆ వేడికి ప్లాస్టిక్ కరిగిపోతుంది. కాబట్టి ప్లాస్టిక్ బకెట్‌లో హీటర్ పెట్టాలనుకుంటే దానిపై ఒక సన్నటి చెక్కను ఉపయోగించడం మేలు. లేదంటే అల్యూమినియం బకెట్ ఉంటే దానికి నేరుగా హీటర్‌ను అమర్చవచ్చు. విద్యుత్తు షాక్ తగిలే ప్రమాదం ఉండటంతో ఇనుప బకెట్‌ను వాడకపోవడం మంచిది. వాటర్ లెవెల్‌ని బట్టి బకెట్‌ను పూర్తిగా నింపిన తర్వాత హీటర్‌ను ఆ నీళ్లలో ఉంచాలి. అది కూడా హీటింగ్ కాయిల్ పూర్తిగా మునిగేలా జాగ్రత్తపడాలి. ఆ తర్వాతే ప్లగ్‌ని సాకెట్‌కి కనెక్ట్ చేసి స్విచ్చాన్ చేయాలి. స్విచ్ వేశాక నీళ్లు వేడయ్యాయో, లేదో చెక్ చేసే విషయంలో కొందరు ఏమరుపాటుగా ఉంటారు. మర్చిపోయి అలాగే నీళ్లలో చెయి పెట్టారంటే షాక్ తగిలి ప్రాణాల మీదకొస్తుంది. స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తొలగించిన తర్వాతే నీళ్లను ముట్టుకోవాలి. పిల్లలున్న ఇళ్లల్లో వాటర్ హీటర్ వాడేటప్పుడు అలర్ట్‌గా ఉండాలి. వారు పదే పదే తిరిగే ప్రదేశాల్లో కాకుండా ఏదో ఒక మూలకు లేదంటే ప్రత్యేకమైన గదిలో ఉంచాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కళ్లు చెదిరేంత బంగారం దొరికినా కన్నెత్తి చూడలేదు..
తిరుమలలో అంబానీ కిచెన్.. నిత్యం 2 లక్షల మందికి సరిపడేలా వంటశాల
ఫుట్‌పాత్‌పై పాలమ్మే వ్యక్తి కూతురు.. వరల్డ్ ఛాంపియన్
