ఫ్రాన్స్​ అధ్యక్షుడు మాక్రాన్​పై దాడి .. ఎందుకు చేశారంటే..?? వీడియో

ఫ్రాన్స్​ అధ్యక్షుడు మాక్రాన్​పై దాడి .. ఎందుకు చేశారంటే..?? వీడియో

Phani CH

|

Updated on: Oct 01, 2021 | 9:51 AM

ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో భద్రతా దళాల నడుమ ఉండే ఆసియా దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రుల్ని సామాన్యులు నేరుగా తాకలేరు. ఇక అమెరికా సంగతి తెలిసిందే. కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది.

ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో భద్రతా దళాల నడుమ ఉండే ఆసియా దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రుల్ని సామాన్యులు నేరుగా తాకలేరు. ఇక అమెరికా సంగతి తెలిసిందే. కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఎంత పెద్ద అధికారి అయినా క్షుణ్ణంగా తనిఖీలు చేశాకే పంపిస్తారు. అటు యూరప్ దేశాల్లోనైతే పాలకులు నేరుగా ప్రజల్లోకి చొచ్చుకుపోవడం సర్వసాధారణంగా జరిగేదే. అయితే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్​పై ఊహించని దాడి జరిగింది. “వివే లా విప్లవం” అని నినాదాలు చేస్తూ లియాన్‌లో ఒక నిరసన కారుడు కోడిగుడ్డుతో కొట్టడం సంచలనం సృష్టించింది. లియాన్​లో ఉన్న ఫ్రెంచ్ గ్యాస్ట్రోనమీ సందర్శనకు మాక్రాన్‌ వెళ్లారు. మీడియా వాళ్లతో మాట్లాడబోతుండగా హఠాత్తుగా ఓ కోడిగుడ్డు అధ్యక్షుడి భుజంపై పడింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: చిత్తూరు జిల్లాలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. !! అమ్మవారి గుడిపై కలశం మాయం.. వీడియో

Shocking Video: వామ్మో.. చిన్నారి ఒడిలో గురకపెడుతున్న భారీ ఫైతాన్.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో.. వైరల్