కొవిడ్-19 పోలికలతో మరో కొత్త వైరస్ విజృంభణ వీడియో
పోయిందనుకున్న మహమ్మారి మళ్ళీ వచ్చేసింది. ఏదైతే రాకూడదనుకున్నామో మళ్ళీ యుటర్న్ తీసుకుంది. ఆసియాలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. ఆసియా అంతటా కరోనా కొత్త వేవ్ ఆందోళన తేలుపుతుంది. ఆసియా అంతటా హాంగ్ కాంగ్, దక్షిణాఫ్రికాలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల మరణాలు కూడా నమోదవుతున్నాయి. వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ వైరస్ వ్యాపించడం ఆందోళన కలిగిస్తుంది. హాంగ్ కాంగ్ గాయకుడు ఈసన్ చాన్ కూడా కోవిడ్ బారిన పడ్డారు. ఈ వారం చివర్లో తైవాన్లోని కోవోష్యాంగ్లో తన కచేరీని రద్దు చేసుకున్నట్లు సమాచారం.
జనసాంద్రత ఎక్కువగా ఉన్న హాంగ్ కాంగ్, సింగపూర్లలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా హాంగ్ కాంగ్లో వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందని నగరంలోని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ కమ్యూనికేషన్ డిసీజ్ తెలిపింది. మే 3 నుంచి ఇప్పటివరకు 31 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. ఏడు మిలియన్లకు పైగా జనాభా ఉన్న నగరంలో గత రెండేళ్ళలో కనిపించిన కేసులతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ వైరల్ లోడ్, కోవిడ్ సంబంధిత అనారోగ్యం, ఆసుపత్రిలో చేరికలు బాగా పెరిగినట్లు సమాచారం. అటు సింగపూర్ కూడా అప్రమత్తమైంది. మే 3 నుండి వేల మందికి కోవిడ్ సోకినట్లు తెలుస్తుంది. రోజువారీ ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య దాదాపు 30% పెరిగింది. దీనికి సంబంధించి నగర రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఈ నెలలో డేటాను విడుదల చేసింది. జనాభాలో రోగ నిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల కేసులు పెరగవచ్చని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
హృదయవిదారకం.. కొడుక్కి తల కొరివి పెట్టిన తల్లి వీడియో
ఇంట్లో తాబేలును ఆ దిశలో ఉంచితే .. పట్టిందల్లా బంగారమే వీడియో
ఈ యువకుడు చేసిన పనికి మీరైతే ఏం చేస్తారు?వీడియో

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో

పెళ్లి రోజు వధువు షాకింగ్ ట్విస్ట్.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు

కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్ వీడియో

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
