తిట్టినందుకు తప్పుడు సలహా.. స్పానిష్‌ జంటపై చాట్ జీపీటీ ప్రతీకారం

Updated on: Aug 21, 2025 | 10:30 AM

టెక్నాలజీ యుగంలో ప్రతి చిన్న విషయానికీ గూగుల్‌ మీద ఆధారపడటం ప్రజలకు అలవాటైపోయింది. చాట్‌ జీపీటీ కూడా అందుబాటులోకి వచ్చాక ఇది మరింత ఎక్కువైంది. అత్యంత ముఖ్యమైన విషయాలను కూడా చాట్‌ జీపీటీతో చర్చించి ముందుకెళ్తున్నారు. తాజాగా అలా చాట్‌జీపీటీని నమ్మిన ఓ జంట ఘోరంగా బుక్కయిపోయింది.

చాట్ జీపీటీ సలహా నమ్మి స్పెయిన్ కు చెందిన ఓ జంట ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయారు. టికెట్లు బుక్ చేసుకున్నా విమానం ఎక్కలేకపోయారు. ఇదంతా చాట్ జీపీటీ ఇచ్చిన తప్పుడు సలహా వల్లే జరిగిందని, గతంలో తాను తిట్టినందుకు చాట్ జీపీటీ ఇలా ప్రతీకారం తీర్చుకున్నట్లుందని సదరు యువతి వాపోయింది. అసలేం జరిగిందంటే..స్పెయిన్ కు చెందిన మెర్రీ కాల్డాస్ ఆమె బాయ్ ఫ్రెండ్ అల్జాండ్రో సిడ్ ఇటీవల ప్యూర్టోరికోలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఏర్పాట్లు చేసుకుంటూ వీసా అవసరమా? లేదా? అనేది తెలుసుకోవడానికి చాట్ జీపీటీని అడిగారు. వీసా అవసరం లేదని సలహా ఇచ్చిన చాట్ జీపీటీ.. ఎలక్ట్రానిక్ సిస్టం ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ (ESTA) తప్పనిసరి అని హెచ్చరించలేదు. దీంతో ఆ జంట ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని విమానాశ్రయం చేరుకున్నారు. విమానం ఎక్కే ముందు అధికారులు వారిని అడ్డుకున్నారు. ప్యూర్టోరికాకు వీసా అవసరం లేదనేది నిజమే అయినప్పటికీ, ఈఎస్టీఏ మాత్రం తప్పనిసరి అని, అది లేకపోవడంతో విమానంలోకి అనుమతించలేమని చెప్పారు. ఈ ఘటనపై మెర్రీ కాల్డాస్ కన్నీటిపర్యంతమయ్యారు. చాట్ జీపీటీని గతంలో తాను తీవ్రంగా అవమానించానని, చాలాసార్లు తిట్టానని గుర్తుచేసుకున్నారు. దానికి ప్రతీకారంగానే చాట్ జీపీటీ ఈ పనిచేసిందని వాపోయారు. ఇకపై చాట్ జీపీటీని తన జన్మలో నమ్మబోనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మునిగిన ముంబై.. ఆర్థిక రాజధాని అతలాకుతలం

Weather Update: మరో మూడు రోజులు వానలు దంచుడే దంచుడు .. ఈ జిల్లాలకు బిగ్‌ అలర్ట్‌..

Roopchand Fish: రక్తం రుచి మరిగిన చేప.. ఇతర చేపలకు భిన్నం

పీఎం కిసాన్‌ డబ్బులు రాలేదా? అయితే ఇలా చేయండి

ప్రేమించిన అమ్మాయికి ‘బాంబు’ గిఫ్ట్‌ పార్శిల్‌ అందుకున్న భర్త.. చివరికి