Samantha Weinstein: క్యాన్సర్‌తో పోరాటం.. పెళ్లైన ఆరు నెలలకే నటి సమంతా కన్నుమూత

|

May 25, 2023 | 9:15 PM

కెనెడాకు చెందిన హాలీవుడ్‌ నటి సమంత 28 ఏళ్ళ చిన్నవయసులోనే కన్నుమూసింది. రెండున్నరేళ్లుగా అండాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. మే 14న ఆమె మరణించగా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. నటి మరణంపై హాలీవుడ్‌ సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

కెనెడాకు చెందిన హాలీవుడ్‌ నటి సమంత 28 ఏళ్ళ చిన్నవయసులోనే కన్నుమూసింది. రెండున్నరేళ్లుగా అండాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. మే 14న ఆమె మరణించగా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. నటి మరణంపై హాలీవుడ్‌ సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సమంత ఇక లేదన్న విషాదాన్ని ఆమె తండ్రి జీర్ణించుకోలేకపోతున్నాడు. ‘తను ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటుంది. తనతో కాసేపు కలిసి మాట్లాడితే చాటు ఆ పాజిటివ్‌ వైబ్స్‌ వస్తాయని చాలామంది చెప్తూ ఉంటారు’ అంటూ కూతుర్ని తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యాడు. సమంత మా అందరి జీవితాలను మార్చివేసిందంటూ ఆమె తల్లి భావోద్వేగానికి లోనైంది. 10 ఏళ్లకే నటనను కెరీర్‌గా ఎంచుకుంది సమంత. 2005లో బిగ్‌ గర్ల్‌లో జోసెఫిన్‌ పాత్రను పోషించింది. పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సమంత 2022 అక్టోబర్‌లో మైఖేల్‌ నుట్సన్‌ను పెళ్లాడింది. మే 1న అతడితో కలిసి హనీమూన్‌కు వెళ్లిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇందులో నటి తన భర్తతో కలిసి చిరునవ్వులు చిందించింది. అయితే అదే ఆమె ఆఖరి పోస్టు కావడం గమనార్హం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. నైరుతి వచ్చేసింది.. ఇక ఎండలు లేనట్టే !!

Adipurush: క్రేజీ రికార్డ్‌ ఆదిపురుష్ నెవర్‌ బిఫోర్ ఫీట్‌ !!

Ram Charan: మ్యాజిక్ అంతా జపాన్‌లోనే !! ఉపాసన పై రాంచరణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్