Bangladesh – India: బంగ్లాదేశ్‌ సంక్షోభం.. భారత్ పై ఎఫెక్ట్ ఎంత.? వీడియో..

|

Aug 10, 2024 | 5:47 PM

బంగ్లాదేశ్‌లో 1971 స్వాతంత్ర్య సమర యోధుల వారసులకు ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్‌ కేటాయించడంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అలా మొదలైన వివాదం నిరసనగా మారి, నిరసనలు చివరకు ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయేందుకు కారణమయ్యాయి. అయితే బంగ్లాదేశ్‌లో తలెత్తిన సంక్షోభం భారత సరిహద్దుల్లో భద్రతాపరిమైన రిస్క్‌ను పెంచడమే కాదు మరో విధంగా తీవ్రమైన నష్టాన్ని కలిగించేలా ఉన్నాయి.

బంగ్లాదేశ్‌లో 1971 స్వాతంత్ర్య సమర యోధుల వారసులకు ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్‌ కేటాయించడంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అలా మొదలైన వివాదం నిరసనగా మారి, నిరసనలు చివరకు ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయేందుకు కారణమయ్యాయి. అయితే బంగ్లాదేశ్‌లో తలెత్తిన సంక్షోభం భారత సరిహద్దుల్లో భద్రతాపరిమైన రిస్క్‌ను పెంచడమే కాదు మరో విధంగా తీవ్రమైన నష్టాన్ని కలిగించేలా ఉన్నాయి. దేశీయ దిగ్గజ కంపెనీలపై బంగ్లాదేశ్ సంక్షోభం ప్రభావం పడుతోంది. స్టాక్ మార్కెట్లో లిస్టయిన చాలా కంపెనీలు ఇప్పుడు బంగ్లాదేశ్ సంక్షోభం ముప్పులో ఉన్నాయి. ఆ కంపెనీల స్టాక్స్ భారీగా పడిపోతున్నాయి.

మరి ఆ రాజకీయ సంక్షోభ ప్రభావం మనదేశ వాణిజ్యంపై ఎంత ఉంటుందనే అంశాన్ని వాణిజ్య వర్గాలు పరిశీలిస్తున్నాయి. మన వస్తువుల ఎగుమతుల వ్యాపారం గత ఆర్థిక సంవత్సరంలో 437 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.36.27 లక్షల కోట్ల) మేర ఉండగా, ఇందులో బంగ్లాదేశ్‌కు జరుగుతోంది 91 వేల,300 కోట్లే. పొరుగుదేశం కావడం, మన జౌళి కంపెనీలకు అక్కడ తయారీ యూనిట్లు ఉండటమే కాస్త ఇబ్బంది పెట్టే అంశం అవుతుంది. అక్కడ అనిశ్చితి కొనసాగితే మాత్రం రెడిమేడ్‌ దుస్తుల యూనిట్లు మనదేశానికి తరలి వచ్చే అవకాశమూ ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.

బంగ్లా సంక్షోభం వల్ల భారత వాణిజ్యంపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చని S&P గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. భారత్‌ నుంచి బంగ్లాదేశ్‌కు ఎగుమతులు స్వల్పంగా ఉండటం ఇందుకు కారణంగా తెలిపింది. ‘బంగ్లాదేశ్‌లో గిరాకీ తక్కువగా ఉండొచ్చు. అందువల్ల భారత్‌ సహా ఇతర దేశాల నుంచి బంగ్లాదేశ్‌కు ఎగుమతులు తగ్గొచ్చ’ని S&P గ్లోబల్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ (ఆసియా పసిఫిక్‌) ఆండ్రూ వుడ్‌ తెలిపారు. బంగ్లాదేశ్‌తో భారత్‌ వాణిజ్యం ఏ ఏ రంగాల్లో ఉంటుందో ఓ సారి చూస్తే ప్రధానంగా, కూరగాయలు, కాఫీ, తేయాకు, సుగంధ ద్రవ్యాలు, చక్కెర, మిఠాయిలు, శుద్ధిచేసిన పెట్రోలియమ్‌ ఉత్పత్తులు, రసాయనాలు, పత్తి, ఇనుము, ఉక్కు, వాహనాలు. ఇక మనం బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల విషయానికొస్తే… చేపలు, ప్లాస్టిక్, తోలు, వస్త్రాలు .

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.