ఆమె వాడిన వస్తువులు మిలియన్‌ డాలర్లు పలుకుతున్నాయా..! వీడియో

కొంత మంది ప్రముఖులు, సెలబ్రెటీలు, వాళ్లు వాడే వస్తువులు వేలంలో చాలా ధర పలకడం మనం వింటూ ఉంటాం. అంతేకాదు ఆ డబ్బుల్ని ఏ సేవా సంస్థలకో ఇవ్వడం లేదా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది.

Phani CH

|

Oct 16, 2021 | 8:14 AM

కొంత మంది ప్రముఖులు, సెలబ్రెటీలు, వాళ్లు వాడే వస్తువులు వేలంలో చాలా ధర పలకడం మనం వింటూ ఉంటాం. అంతేకాదు ఆ డబ్బుల్ని ఏ సేవా సంస్థలకో ఇవ్వడం లేదా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒక ప్రముఖ బ్రిటన్‌ పాప్‌ సింగర్‌, రచయిత అయిన అమీ జాడే వైన్‌ హౌస్‌ విషయంలో కూడా ఇలానే జరిగింది. వైన్‌ హౌస్‌ విషపూరిత ఆల్కహాల్‌ని సేవించి 2011లో అతి చిన్న వయసులో ఆమె మరణించింది. అంతేకాదు అత్యంత పిన్న వయసులోనే మ్యూజిక్‌ ఆల్బమ్‌ సింగర్‌గా, పాప్‌ గాయనిగా కెరియర్‌ సాగించి ప్రతిష్టాత్మకమైన ఐదు గ్రామీ అవార్డులు పొందిన గాయని అమీ జాడే. అయితే ఆమె ఎక్కువగా స్వచ్చంద కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక సామాజిక కార్యకర్తగా చాలా చురుగ్గా వ్యవహరించేది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Srilanka: శ్రీలంకలో భగ్గుమన్న నిత్యావసర వస్తువుల ధరలు..!! గగ్గోలు పెడుతున్న జనం.. వీడియో

అమెరికాలో ఇళ్ల మధ్య కుప్పకూలిన విమానం..!! నెట్టింట వైరల్‌ అవుతున్న ప్రమాద దృశ్యాలు.. వీడియో

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu