అమెరికాలో ఇళ్ల మధ్య కుప్పకూలిన విమానం..!! నెట్టింట వైరల్ అవుతున్న ప్రమాద దృశ్యాలు.. వీడియో
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా ఓ విమానం కుప్పకూలిపోయింది. యూఎస్ క్యాలిఫోర్నియా శాంటీలోని నివాస ప్రాంతంలో అక్టోబరు 11 మధ్యాహ్నం విమానం కుప్పకూలడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా ఓ విమానం కుప్పకూలిపోయింది. యూఎస్ క్యాలిఫోర్నియా శాంటీలోని నివాస ప్రాంతంలో అక్టోబరు 11 మధ్యాహ్నం విమానం కుప్పకూలడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. పలు ఇళ్లు, ట్రక్ ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో పైలట్, యూపీఎస్ డ్రైవర్ మరణించారని పేర్కొన్నారు. పాఠశాల సమీపంలో అకస్మాత్తుగా విమానం కుప్పకూలి రోడ్డుపైకి దూసుకొచ్చిందని.. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. విమానం, పలు వాహనాలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆకాశం నుంచి దూసుకొచ్చిన మృత్యువు.. అదృష్టం బాగుండి.. !! వీడియో
Viral Video: ఇదేంటి… ఈ ఇల్లు గిరగిరా తిరుగుతోంది? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో