Iran: ఇరాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం.! మాదక ద్రవ్యాల కేంద్రంలో 32 మంది మృతి.

|

Nov 04, 2023 | 9:33 AM

ఇరాన్‌లో జరిగిన ఘోర అగ్రి ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మత్తు మందుల నుంచి బయటపడాలన్న మంచి ఆశయంతో మాదక ద్రవ్యాల పునరావాస కేంద్రంలో చేరిన బాధితులు అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో అంతులేని శోకాన్ని మిగిల్చింది. మరో 16 మంది గాయపడ్డారని ఇరాన్ మీడియా శుక్రవారం తెలిపింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో బాధితులు గదుల్లో చిక్కుకుపోయారు.గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఏకంగా 32 మంది మృత్యువాత పడ్డారు.

ఇరాన్‌లో జరిగిన ఘోర అగ్రి ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మత్తు మందుల నుంచి బయటపడాలన్న మంచి ఆశయంతో మాదక ద్రవ్యాల పునరావాస కేంద్రంలో చేరిన బాధితులు అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో అంతులేని శోకాన్ని మిగిల్చింది. గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఏకంగా 32 మంది మృత్యువాత పడ్డారు. మరో 16 మంది గాయపడ్డారని ఇరాన్ మీడియా శుక్రవారం తెలిపింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో బాధితులు గదుల్లో చిక్కుకుపోయారు. మంటల ధాటికి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో బాధితులు తప్పించుకునే మార్గం లేకుండా పోయినట్టు తెలుస్తోంది. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉత్తర గిలాన్ ప్రావిన్స్‌లోని లాంగరుడ్ నగరంలోని డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చెలరేగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని ఆ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ మొహమ్మద్ జలాయ్ తెలిపారు. సెంటర్‌ నిర్వాహకుడితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.