గాజా సిటీలో ప్రతి వీధిలో కాల్పులు జరుపుతున్న ఇజ్రాయెల్ సైన్యం

|

Nov 10, 2023 | 8:43 PM

గాజా 'స్ట్రిపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్‌ సైన్యం గాజా సిటీలోకి ప్రవేశించింది. ఉత్తర, దక్షిణ దిక్కుల నుంచి గాజాసిటీ మధ్యలోకి చొచ్చుకువచ్చింది. వాయు, నౌకా, పదాతిదళాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ ముందుకు కదులుతున్నాయి. గాజా నగరంలో ఉన్న సొరంగాల్లో హమాస్‌ మిలిటెంట్లు, బందీల కోసం ఇజ్రాయెల్‌ బలగాలు అణువణువూ గాలిస్తున్నాయి. ఉత్తర గాజాలో ఉన్న ప్రజలను దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని సూచిస్తున్నాయి. వారి కోసం మార్గాన్ని ఏర్పాటు చేశాయి.

గాజా ‘స్ట్రిపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్‌ సైన్యం గాజా సిటీలోకి ప్రవేశించింది. ఉత్తర, దక్షిణ దిక్కుల నుంచి గాజాసిటీ మధ్యలోకి చొచ్చుకువచ్చింది. వాయు, నౌకా, పదాతిదళాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ ముందుకు కదులుతున్నాయి. గాజా నగరంలో ఉన్న సొరంగాల్లో హమాస్‌ మిలిటెంట్లు, బందీల కోసం ఇజ్రాయెల్‌ బలగాలు అణువణువూ గాలిస్తున్నాయి. ఉత్తర గాజాలో ఉన్న ప్రజలను దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని సూచిస్తున్నాయి. వారి కోసం మార్గాన్ని ఏర్పాటు చేశాయి. తాజాగా ఉత్తర గాజాలో హమాస్‌ పట్టు కోల్పోయింది. ఈ విషయం అక్కడి ప్రజలకు అర్థమై వారు ఉత్తర గాజా నుంచి దక్షిణ భాగానికి వలసవెళ్తున్నారు. ప్రజలు దక్షిణ గాజాకు వెళ్లేందుకు వీలుగా నిర్ణీత సమయాల్లో గాజాలో కాల్పులకు విరామం ఇస్తుంది ఐడీఎఫ్‌. గాజా సిటీలో ఎక్కువ మంది హమాస్‌ మిలిటెంట్లు ఉన్నారని భావిస్తున్న ఇజ్రాయెల్ సేనలు.. వీధివీధినా వారి కోసం జల్లెడ పడుతున్నారు. హమాస్ నిర్మించిన విస్తారమైన, దుర్బేధ్యమైన సొరంగాల నెట్‌వర్క్‌ను గుర్తించి, నాశనం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న టన్నెల్‌ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసేందుకు కంబాట్ ఇంజినీర్‌లు భయంకర పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరదలో బస్సు.. తాళ్లసాయంతో బయటకొచ్చిన ప్రయాణీకులు

తొలి విడత గోల్డ్‌ బాండ్లపై పెట్టుబడి పెట్టినవారికి అదిరిపోయే రిటర్న్స్‌

కూలీని లక్షాధికారిని చేసిన వజ్రం.. 10 లక్షల నగదు, ఐదు తులాల బంగారం ఇచ్చి కొన్న వ్యాపారి

గుండెపోటుతో యజమాని మృతి.. పొలం నుంచి పరుగున వచ్చిన ఆవు ఏం చేసిందంటే ??

Follow us on