కొంపముంచిన క్రోమింగ్ ఛాలెంజ్.. 12 ఏళ్ల బాలుడికి గుండెపోటు..
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత చిన్న, పెద్దా అంతా బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. రకరకాల ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు మరణాలు చోటుచేసుకోగా.. తాజాగా మరో బాలుడికి ప్రాణం మీదకొచ్చింది. క్రోమింగ్ ఛాలెంజ్‌లో భాగంగా పర్ఫ్యూమ్‌ను పీల్చిన ఓ 12 ఏళ్ల బాలుడు గుండెపోటుకు గురయ్యాడు.
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత చిన్న, పెద్దా అంతా బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. రకరకాల ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు మరణాలు చోటుచేసుకోగా.. తాజాగా మరో బాలుడికి ప్రాణం మీదకొచ్చింది. క్రోమింగ్ ఛాలెంజ్‌లో భాగంగా పర్ఫ్యూమ్‌ను పీల్చిన ఓ 12 ఏళ్ల బాలుడు గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. యూకేలోని సౌత్ యార్క్‌షైర్‌కు చెందిన బాలుడు.. ఇంట్లో ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. శబ్దం విని అక్కడకు వచ్చిన తల్లి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితోపాటు వణుకుతూ కనిపించిన తన కుమారుడ్ని చూసి షాకయింది. గుండెపోటుగా భావించిన ఆమె.. వెంటనే బాలుడికి సీపీఆర్ చేయడంతోపాటు ఎమర్జెన్సీ విభాగానికి సమాచారమిచ్చింది. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో పలుసార్లు బాలుడు మూర్ఛ, గుండెపోటుకు గురయ్యాడు. చివరకు ఆ బాలుడికి ప్రాణాపాయం తప్పింది. అతడు ఇలా కావడానికి క్రోమింగ్ ఛాలెంజ్ కారణమని వైద్యులతోపాటు పోలీసులు కూడా నిర్ధరించారు. ఈ ప్రమాదకర ఘటన వివరాలను బాలుడి తల్లి సోషల్ మీడియాలో వివరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రెండ్ అవ్వాలని పాముతో సెల్ఫీలా ??
Thangalaan: గుడ్ న్యూస్ !! అప్పుడే OTTలోకి విక్రమ్ తంగలాన్
ఇండస్ట్రీలో ఎవరూ బయటపెట్టని సీక్రెట్స్ చాలా ఉన్నాయి.. సుమలత షాకింగ్ కామెంట్స్
Mr Bachchan: ఇట్స్ అఫీషియల్.. OTTలోకి రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ..
డెలివరీ డేట్‌కు ముందు.. వినాయకుడి దీవెనలందుకున్న స్టార్ కపుల్