ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వారానికి 4 రోజులే వర్కింగ్ డేస్..

|

Dec 03, 2022 | 9:27 AM

ఉద్యోగులందరికీ శుభవార్త.. ఇకనుంచి వారానికి నాలుగురోజలు పని చేస్తే చాలు. అవును ఇది నిజమే.. కానీ మన దగ్గర కాదు.. ఉద్యోగులపై ఒత్తిడిని తగ్గించేందుకు బ్రిటన్‌లోని కొన్ని కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

ఉద్యోగులందరికీ శుభవార్త.. ఇకనుంచి వారానికి నాలుగురోజలు పని చేస్తే చాలు. అవును ఇది నిజమే.. కానీ మన దగ్గర కాదు.. ఉద్యోగులపై ఒత్తిడిని తగ్గించేందుకు బ్రిటన్‌లోని కొన్ని కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సుమారు వంద కంపెనీలు వీక్లీ ఫోర్ వర్కింగ్ డేస్ అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇక నుంచి ఉద్యోగులు వారంలో నాలుగురోజులు పని చేస్తే చాలు.. మిగిలిన 3 రోజులు ఎంచక్కా హాలిడేస్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ వంద కంపెనీల్లో దాదాపు 2,600 మంది ప‌నిచేస్తున్నారు. 4 డే వీక్ క్యాంపెయిన్‌లో భాగంగా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. లండ‌న్‌లోని అతి పెద్ద కంపెనీలు అయిన అట‌మ్ బ్యాంక్, గ్లోబల్ మార్కెటింగ్ కంపెనీ అవిన్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం వీటిల్లో ఒక్కో సంస్థలో 450 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారంలో నాలుగే వర్కింగ్ డేస్ కావడంతో.. ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తారని ఆ కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. దీనివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతోందని భావిస్తున్నారు. ఒత్తిడి లేకుండా ఉద్యోగులు పని చేయడం వల్ల మంచి అవుట్‌పుట్‌ క్రియేట్ అవుతుందని యాజమాన్యాలు అంచనా వేస్తున్నాయి. యూర‌ప్‌లోని మిగ‌తాదేశాల‌తో పోల్చితే బ్రిట‌న్‌లోనే ప‌నిదినాలు ఎక్కువ‌. దాంతో, నాలుగు రోజుల ప‌నిదినాలను ప్రయోగాత్మకంగా బ్రిట‌న్‌లోని కొన్ని కంపెనీల్లో ప్రవేశపెట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Digital TOP 9 NEWS: చిన్నారి ప్రాణం తీసిన కోతి..ఏం జరిగిందంటే.! | రైలు ఎక్కలేక ఇబ్బందిపడ్డ మహిళ

Published on: Dec 03, 2022 09:27 AM