వారంలో ఐదు రోజుల పాటు సుమారు 30 నిమిషాలు మెట్లు ఎక్కడం వల్ల బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి ఎక్కువ మెట్లు ఎక్కకుండా మొదటగా తక్కువ మెట్లతో ప్రారంభించి క్రమేపీ పెంచాలని సూచిస్తున్నారు. కేలరీలు కరిగడానికి శరీర బరువు ఎక్కిన సమయం లాంటి అనేక విషయాలు ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. రోజూ మెట్లు ఎక్కడం వల్ల కలిగే మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే మీరు ఎక్కువ కాలం జీవించే అవకాశాలను పెంచుకోవడం. అంటే ఆయుర్దాయం పెరుగుతుందన్నమాట. అందుకే రోజూ మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోమంటున్నారు నిపుణులు.