ఆడవాళ్లను చూస్తే అతడికి ఊపిరాడదు.. అందుకే 55 ఏళ్లుగా ..!

|

Oct 15, 2023 | 5:55 AM

మనుషులను రకరకాల భయాలు పట్టి పీడిస్తుంటాయి. ఇలాంటి ఫోబియాలు చనిపోయే దాకా వారిని వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా దెయ్యాలు, క్రూర జంతువులు, పాములు, ఎత్తైన ప్రదేశాలు, చీకటి.. ఇలా కొంతమంది కొన్నింటిని చూస్తే.. గజ గజ వణికిపోతూ ఉంటారు. తాజాగా ఆడవాళ్ళంటేనే భయపడే వ్యక్తి వార్తల్లో నిలిచాడు. రువాండాకు చెందిన 71 ఏళ్ల కాలిటెక్స్‌ నజాంవిటా..

మనుషులను రకరకాల భయాలు పట్టి పీడిస్తుంటాయి. ఇలాంటి ఫోబియాలు చనిపోయే దాకా వారిని వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా దెయ్యాలు, క్రూర జంతువులు, పాములు, ఎత్తైన ప్రదేశాలు, చీకటి.. ఇలా కొంతమంది కొన్నింటిని చూస్తే.. గజ గజ వణికిపోతూ ఉంటారు. తాజాగా ఆడవాళ్ళంటేనే భయపడే వ్యక్తి వార్తల్లో నిలిచాడు. రువాండాకు చెందిన 71 ఏళ్ల కాలిటెక్స్‌ నజాంవిటా ఇలాంటి అసాధారణమైన భయంతో బాధపడుతూ ప్రపంచాన్ని నివ్వెరపర్చాడు. మహిళలంటే ఉన్న భయంతో గత 55 సంవత్సరాలుగా స్వీయ నిర్బంధంలో ఉండిపోయాడు. అతనికి పదహారేళ్ల వయసప్పుడే ఈ భయం పట్టుకుంది. అప్పటినుంచి మహిళ కనిపిస్తే చాలు ఇంట్లోకి వెళ్లి తలుపు తాళం వేసుకుంటాడు. ఆడవాళ్లంటే దెయ్యాన్ని చూసినట్టు భయపడతాడు. అందుకే నజాంవిటా తన ఇంటి చుట్టూ 15 అడుగుల ఎత్తైన కంచెను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆడవాళ్ళకే కాదు పురుషులకు కూడా దూరంగా ఉంటున్నాడట. అయితే ఇంట్రస్టింగ్‌ విషయం ఏమిటంటే అతణ్ని అర్థం చేసుకున్న ఇరుగు పొరుగు మహిళలు కాలిటెక్స్‌ కు ఆహారం, కిరాణా సామాన్లు లాంటివి అందించి జీవించడానికి సహాయం చేయడం. అతనికి అవసరమైన వాటిని ఇంట్లో వదిలి వెళ్లేవారు. వాళ్లు అలా వెళ్లిపోయాక అపుడు వాటిని అతను తీసుకుంటాడట. స్త్రీల పట్ల ఉండే భయాన్ని గైనో ఫోబియా అంటారు. ముఖ్యంగా ఛాతి పట్టేసినట్టు అయిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ముచ్చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలొస్తాయి.