Helmet or Seat belt: హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

| Edited By: Shaik Madar Saheb

Dec 24, 2024 | 10:23 PM

మోటారు వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్న సందేశాన్ని ప్రజలకు పంపాల్సిన అవసరముందని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది... అయితే.. జరిమానా సొమ్మును 90 రోజుల్లో చెల్లించకుంటే వాహనాన్ని జప్తు చేయొచ్చన్న నిబంధనను ఎందుకు అమలు చేస్తారా.? నిర్దిష్ట సమయంలో చలానాలు చెల్లించని వారి వాహనాలను సెక్షన్‌-167 ప్రకారం సీజ్‌ చేస్తారా.? సెక్షన్‌-206 ప్రకారం వారి లైసెన్స్‌ రద్దు చేస్తారా? తెలుసుకుందాం..

మోటారు వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్న సందేశాన్ని ప్రజలకు పంపాల్సిన అవసరముందని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. రహదారులపై ముమ్మర తనిఖీలు చేసి, నిబంధనలు పాటించని వారికి అక్కడికక్కడే జరిమానాలు విధించాలని, అప్పుడే వాహనదారుల్లో భయం ఉంటుందని వ్యాఖ్యానించింది. పోలీసులు రోడ్డుపై ఉంటే నేరం చేయడానికి సిద్ధపడ్డ వారు కూడా వెనక్కితగ్గడమో, వాయిదా వేయడమో చేస్తారని పేర్కొంది. మోటారు వాహన చట్ట నిబంధనలను అమలు చేయకపోవడంతో ప్రమాదాలు జరిగి, భారీగా మరణాలు సంభవిస్తున్నాయంటూ న్యాయవాది తాండవ యోగేశ్‌ గతంలో హైకోర్టులో పిల్‌ వేశారు.

దీనిపై ఇటీవల విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం.. ట్రాఫిక్‌ ఐజీని వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. బుధవారం జరిగిన విచారణకు డీజీపీ కార్యాలయం నుంచి ఐజీ ఆకే రవికృష్ణ (లీగల్‌) హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం.. పోలీసులు క్రియాశీలకంగా వ్యవహరించాలని గుర్తుచేస్తూ, పలు విషయాలు ప్రస్తావించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.