ఎంపాక్స్ వస్తే ఏం చెయ్యాలి ?? ఆరోగ్య శాఖ ఏం చెబుతోంది ??

|

Sep 28, 2024 | 11:51 AM

కేరళలో అటు నిఫా.. ఇటు మంకీపాక్స్ అలజడి రేపుతోంది. సెప్టెంబర్ 9న నిఫా వైరస్ కారణంగా 24 ఏళ్ల యువకుడు మరణించిన నేపథ్యంలో కేరళలోని మలప్పురంలో కంటైన్‌మెంట్ జోన్‌లు ఏర్పాటు చేసి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా నిఫా వైరస్ నిర్ధారణ కావడం తో ఓ వ్యక్తిని అతనితో ఉన్న 250 మందిని ఐసొలేషన్ లో ఉంచారు. మంకీపాక్స్, నిఫా ఇన్‌ఫెక్షన్‌లను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

కేరళలో అటు నిఫా.. ఇటు మంకీపాక్స్ అలజడి రేపుతోంది. సెప్టెంబర్ 9న నిఫా వైరస్ కారణంగా 24 ఏళ్ల యువకుడు మరణించిన నేపథ్యంలో కేరళలోని మలప్పురంలో కంటైన్‌మెంట్ జోన్‌లు ఏర్పాటు చేసి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా నిఫా వైరస్ నిర్ధారణ కావడం తో ఓ వ్యక్తిని అతనితో ఉన్న 250 మందిని ఐసొలేషన్ లో ఉంచారు. మంకీపాక్స్, నిఫా ఇన్‌ఫెక్షన్‌లను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కేరళకు వచ్చిన ఓ రోగి మంకీపాక్స్‌ లక్షణాలతో తొలుత ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. తర్వాత మంకీపాక్స్ క్లేడ్ 1 బి ఇన్ఫెక్షన్‌గా నిర్ధారణ కావడంతో వ్యాధికి మంజేరి మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ క్రమంలో తమిళనాడు – కేరళ సరిహద్దు జిల్లాలో అలెర్ట్ ప్రకటించారు. కేరళ నుంచి కన్యాకుమారి ద్వారా తమిళనాడు కి వస్తున్న వాహనాలపై నిఘా పెంచారు అధికారులు పూర్తి వైద్య పరీక్షల అనంతరం తమిళనాడు లోకి అనుమతిస్తున్నారు. వైరస్ లక్షణాలున్న వారిని గుర్తించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని తమిళనాడు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. నాగర్‌కోయిల్ లో ప్రత్యేక మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసింది. భారత్‌లో తొలి మంకీపాక్స్‌ కేస్‌ ఢిల్లీలో నమోదైంది. ఢిల్లీలో ఇటీవల ఒకరికి మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించారు. హర్యానాలోని హిసార్‌కు చెందిన 26 ఏళ్ల వ్యక్తికి టెస్టుల్లో వెస్ట్ ఆఫ్రికన్ మంకీపాక్స్ వైరస్ ఉనికిని గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మంకీపాక్స్ సోకిన వ్యక్తి ఢిల్లీలోని ఐసోలేషన్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేవర సినిమా చూస్తూ.. ఆగిన అభిమాని గుండె

చెన్నై థియేటర్లో.. దేవరను చూస్తూ అనిరుధ్‌ హంగామా

దేవర థియేటర్లో రాజమౌళి హంగామా

NTR ఫ్యాన్స్‌ను చితగ్గొట్టిన పోలీసులు

దేవర కోసం యాట మొక్కు.. ఎవ్వరూ తగ్గట్లే !!

Published on: Sep 28, 2024 11:48 AM