Viral Video: తిమింగలానికి తిక్కరేగితే ఇంతే మరి.. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఏం చేసిందో చూశారా.?

|

Jul 24, 2024 | 1:44 PM

అమెరికాలోని న్యూహాంప్‌షైర్ వద్ద ప్రోట్స్‌మౌత్ హార్బర్ సముద్రంలో 23 అడుగుల పొడవుండే బోటుతో కొందరు వ్యక్తులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. అదే సమయంలో ఓ భారీ తిమింగలం బోటు సమీపానికి వచ్చింది. దీంతో సమీపంలోనే..

అమెరికాలోని న్యూహాంప్‌షైర్ వద్ద ప్రోట్స్‌మౌత్ హార్బర్ సముద్రంలో 23 అడుగుల పొడవుండే బోటుతో కొందరు వ్యక్తులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. అదే సమయంలో ఓ భారీ తిమింగలం బోటు సమీపానికి వచ్చింది. దీంతో సమీపంలోనే మరో బోటులో ఉన్న ఇద్దరు వ్యక్తులు దానిని వీడియో తీస్తుండగా ఊహించని ఘటన జరిగింది. తిమింగలం ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి బోటుపై దాడిచేసింది. దీంతో ఆ బోటు బోల్తాపడింది. దీనిని ముందే ఊహించిన ఓ వ్యక్తి సముద్రంలో దూకేయగా, మరోవ్యక్తి తిమింగలం దాడితో నీటిలో పడిపోయాడు. వెంటనే సమీపంలోని వ్యక్తులు కొందరు వారిని రక్షించారు. దీంతో వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటప పడ్డారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి