ఆగిఉన్న లారీని ఢీకొట్టిన బైక్‌.. మానవత్వం చాటుకున్న జిల్లా ఎస్పీ..

|

Nov 09, 2023 | 9:38 PM

సాధారణంగా పోలీసులంటే ప్రజల్లో ఓ రకమైన భయం ఉంటుంది. ఎందుకంటే.. ప్రజల పట్ల కొందరు పోలీసులు అలా ప్రవర్తిస్తుంటారు. కానీ అందరూ అలా ఉండరని నిరూపిస్తుంటారు మరికొందరు పోలీసులు. అందుకు నిదర్శనమే.. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తి పట్ల మానవత్వాన్ని చూపించి శభాష్‌ అనిపించుకున్నారు ఈ పోలీస్ ఉన్నతాధికారి. ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలై ఆపదలో ఉన్న ఇద్దరు వ్యక్తులను చూసి చలించిపోయారు.

సాధారణంగా పోలీసులంటే ప్రజల్లో ఓ రకమైన భయం ఉంటుంది. ఎందుకంటే.. ప్రజల పట్ల కొందరు పోలీసులు అలా ప్రవర్తిస్తుంటారు. కానీ అందరూ అలా ఉండరని నిరూపిస్తుంటారు మరికొందరు పోలీసులు. అందుకు నిదర్శనమే.. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తి పట్ల మానవత్వాన్ని చూపించి శభాష్‌ అనిపించుకున్నారు ఈ పోలీస్ ఉన్నతాధికారి. ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలై ఆపదలో ఉన్న ఇద్దరు వ్యక్తులను చూసి చలించిపోయారు. పశ్చిమగోదావరి జిల్లా లంకలకోడేరు నుంచి వీరవాసరం వెళ్లే మార్గంలో ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా లారీని ఢీకొట్టడంతో స్పృహ తప్పి పడిపోయారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎస్పీ రవిప్రకాష్.. ప్రమాదాన్ని గమనించి తక్షణమే స్పందించారు. కారు దిగి క్షతగాత్రులకు సిబ్బందితో సీపీఆర్ చేయించారు. స్వయంగా అంబులెన్స్‌కి కాల్ చేసి.. క్షతగాత్రులను దగ్గరుండి హాస్పిటల్‌కు తరలించారు. అంతేకాదు.. ప్రమాదం జరిగిన పరిధిలోని సీఐ, ఎస్ఐలకు ఫోన్‌ చేసి తక్షణమే వైద్య సంబంధిత చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బావిలో పడిన శునకం.. కాపాడేందుకు హైదరాబాద్‌నుంచి స్పెషల్‌ టీం

ఫ్లైట్ లో తెలుగు మహిళపై లైంగిక వేధింపులు.. తోటి ప్రయాణికుడే..

రైలు పట్టాల మధ్య టపాసులు కాల్చిన యూట్యూబర్‌

Vande Sadharan: త్వరలో పట్టాలెక్కనున్న‘వందే సాధారణ్‌’ రైళ్లు.. ట్రయల్‌ రన్‌ విజయవంతం

టీ ఇవ్వలేదని సర్జరీ మధ్యలో ఆపేసిన డాక్టర్ !! మత్తుమందుతో వేచి చూసిన నలుగురు పేషెంట్లు​