Weather Update: ఏపీలోని ఆ జిల్లాకు హైఅలెర్ట్.. రెండు రోజులు భారీ వర్షాలు

|

Nov 21, 2023 | 7:16 PM

నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేటలో వర్షం దంచి కొడుతోంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, నెల్లూరు జిల్లాలో జలాశయాలు పూర్తిగా నిండుకున్నాయి.

Weather Update: ఏపీలోని ఆ జిల్లాకు హైఅలెర్ట్.. రెండు రోజులు భారీ వర్షాలు
Rains
Follow us on

ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. రెండు రోజులుగా అక్కడక్కడ పడుతున్న వర్షాలు….నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేటలో వర్షం దంచి కొడుతోంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, నెల్లూరు జిల్లాలో జలాశయాలు పూర్తిగా నిండుకున్నాయి. దీంతో పంటల సాగుకు చుక్క నీరు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు జోరు వానలతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా సూళ్లూరుపేటలో నిర్వహించాల్సిన సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన రద్దయింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..