Telangana: బాహుబలి దున్నపోతుల మధ్య యుద్ధం.. చూసేందుకు ఊరంతా సిద్దం.. వీడియో వైరల్
దున్నపోతుల మధ్య జరిగే పోరాటం అంటే హైదరబాద్ సదర్ ఉత్సవాలు గుర్తొస్తాయి. సదర్ పండుగ వచ్చిందంటే ఖరీదైన దున్నపోతులను.. బాహుబలి లాంటి శరీర సౌష్టవం ఉన్న దున్నలను ముస్తాబు చేసి వేడుకల జరుపుతారు. ప్రత్యేకంగా పెంచిన దున్నపోతులను ఒకదానితో ఒకటి పోరాడటానికి సిద్ధం చేస్తారు.
తెలంగాణ రాష్ట్ర జంతువు అడవి దున్నలకు కవ్వాల్ అభయారణ్యం కేరాఫ్ అడ్రస్. దట్టమైన అభయారణ్యంలో స్వేచ్చగా తిరుగుతూ అప్పుడప్పుడు పర్యాటకులను, అటవి సమీప గ్రామాల ప్రజలకు తారసపడుతుంటాయి. ఈ సారి మాత్రం భీకర పోరుకు కాలు దువ్వి స్థానికుల కంట పడ్డాయి. నిర్మల్ జిల్లా కడెం మండలం కవ్వాల్ అభయారణ్యం లోని గంగాపూర్ సమీపంలో ఓ రెండు అడవి దున్నలు పోట్లాడుతూ స్థానికులకు కనిపించాయి. బాహుబలి దున్నలుగా పిలిచే కవ్వాల్ అడవి దున్నలు ఒకదానితో ఒకటి హోరాహోరీగా తలపడ్డాయి. ఈ దృశ్యాలను గంగాపూర్ కు చెందిన గ్రామస్తులు తమ సెల్ ఫోన్లలలో రికార్డ్ చేశారు. అడవి దున్నల మధ్య సాగిన భీకర పోరు ఆకట్టుకుంది.
వైరల్ వీడియోలు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్

