ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్.. కొత్త తరహా మోసం

Updated on: Oct 22, 2025 | 7:39 PM

వరంగల్ లో ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసం వెలుగుచూసింది. ఏసీబీ అధికారులమని నమ్మించి, ఓ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నుండి ఆన్‌లైన్ ద్వారా రూ.10 లక్షలు కొట్టేశారు కేటుగాళ్లు. అరెస్ట్ బెదిరింపులతో మొదట రూ.2 లక్షలు, మరుసటి రోజు మరో రూ.8 లక్షలు బదిలీ చేయించుకున్నారు. బాధితుడు మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో కొత్త తరహా మోసాలు వెలుగుచూస్తున్నాయి. వరంగల్ లో ఇటీవల జరిగిన ఘటనలో ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారుల పేరు చెప్పి కొందరు కేటుగాళ్లు ఒక ఆర్టీఏ (Road Transport Authority) అధికారిని మోసగించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (MVI) గా విధులు నిర్వర్తిస్తున్న అధికారిని లక్ష్యంగా చేసుకుని ఆగంతకులు రూ.10 లక్షలు కొట్టేశారు. దుండగులు తమను ఏసీబీ అధికారులుగా పరిచయం చేసుకుని ఎంవీఐకి ఫోన్ చేశారు. అరెస్ట్ చేసేందుకు వస్తున్నామని బెదిరించారు. ఈ బెదిరింపులకు భయపడిన ఎంవీఐ, వెంటనే ఆన్‌లైన్ ద్వారా రూ.2 లక్షలు బదిలీ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బీ కేర్ ఫుల్..బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

Heavy Rains: భారీ వర్షాలతో.. ఉప్పొంగుతున్న కపిలతీర్థం జలపాతం

రూ.కోట్లు ఖర్చుచేసి సినిమాలు తీస్తుంటే.. నెగెటివ్ రివ్యూలు ఇస్తారా

ఫేక్ రివ్యూలపై యుద్ధానికి సిద్ధమవుతోన్న నిర్మాతలు

కె-ర్యాంప్ నిర్మాత ఆగ్రహానికి కారణం ఏంటి ?