అద్దెకు కొండముచ్చులు..ఎందుకో, ఎక్కడో తెలుసా? వీడియో
వరంగల్ జిల్లాలో కోతుల బెడద తీవ్రంగా మారింది. పంటలను, ఇళ్లను ధ్వంసం చేస్తూ రైతులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు రైతులు కొండముచ్చులను అద్దెకు తెచ్చుకుంటున్నారు. రోజుకు రూ.200 ఖర్చుతో కొండముచ్చులను పొలం వద్ద కాపలా ఉంచుతూ పంటలను కాపాడుకుంటున్నారు. అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ జిల్లాలోని గ్రామాల్లో కోతుల బెడద తీవ్రరూపం దాల్చింది. పంట పొలాలను నాశనం చేయడంతో పాటు, ఇళ్లలోకి చొరబడి జనాలపై దాడులకు పాల్పడుతూ భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో రైతులు వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నారు. జంతువుకు జంతువుతోనే సమాధానం చెప్పాలన్నట్లుగా కోతులను తరిమేందుకు కొండముచ్చులను రంగంలోకి దించారు.
మరిన్ని వీడియోల కోసం :
