కీళ్లనొప్పులు వేధిస్తున్నాయా.. జుట్టు విపరీతంగా రాలిపోతుందా..!

Updated on: Feb 24, 2025 | 9:32 PM

శరీరానికి విటమిన్ డి చాలా ముఖ్యం. విటమిన్ డి లోపం వల్ల అనేక సమస్యలు వస్తాయి. శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి శరీరంలో తగినంత డి విటమిన్ ఉండాలి. ఇది తగ్గినప్పుడు శరీరంలోని వివిధ అవయవాల పనితీరుకు అంతరాయం కలుగుంది. శరీరంలో విటమిన్ డి తగ్గినప్పుడు కండరాల నొప్పి తలెత్తుతుంది.

దీనిని చాలామంది అలసటగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా ఈ సమస్య తగ్గకపోతే, వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. విటమిన్ డి లోపం వల్ల జుట్టు కూడా రాలిపోతుందంటున్నారు. చాలా మంది దీనిని జన్యుపరమైన సమస్యగా భావిస్తారు. కానీ ఇది విటమిన్ డి లోపం వల్ల కూడా సంభవిస్తుందంటున్నారు. డి విటమిన్ లోపం వల్ల తలలో ఫోలికల్స్ ఏర్పడటానికి దారి తీస్తుంది. ఫలితంగా జుట్టు సమస్యలు వస్తాయి. అలాగే శరీరంలోని వివిధ భాగాలంలొ కీళ్ల నొప్పి రావడం కూడా విటమిన్ డి లోపం లక్షణాలలో ఒకటి. కడుపు ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఈ విటమిన్‌ లోపం వల్ల రావచ్చంటున్నారు. విటమిన్ డి కోసం రోజుకు 15 నుంచి 30 నిమిషాలు ఎండలో గడపడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం 7నుంచి 10 గంటల మధ్య వచ్చే సూర్యరశ్మినుంచి డి విటమిన్‌ లభిస్తుందని చెబుతున్నారు. అలాగే ఆహారంలో తగినంత మొత్తంలో విటమిన్ డి ఉన్న ఆహారాలను తీసుకోవాలి. చేపలు, పుట్టగొడుగులు, పాల ఉత్పత్తులు, గుడ్లు, ధాన్యపు ఆహారాలు వంటివి. సమస్య సహజంగా పరిష్కారం కాకపోతే, తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మట్టి ఇంట్లో నివాసం.. రూ. 2 కోట్ల జాబ్‌ కొట్టిన టెకీ

జామ పండు.. యాపిల్​.. ఆరోగ్యానికి ఏది మంచిది?

తన డ్రాయింగ్‌తో హంతకుడిని పట్టించిన నాలుగేళ్ల చిన్నారి

కొబ్బరి చిప్పలతో 100 రకాల.. గృహాలంకరణ వస్తువులు

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టికెట్‌ బుకింగ్‌లో కీలక మార్పులు