Delivery On Horse: బైకులు వదిలి గుర్రాలెక్కిన ఫుడ్‌ డెలివరీ బోయ్స్‌.! వీడియో వైరల్..

Updated on: Jan 04, 2024 | 4:48 PM

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ.. ప్రస్తుత కాలంలో దీనికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతాకాదు. వండుకునే సమయంలేక కొందరు, ఏం వండుకుంటాంలే రోజూతినేదే.. ఇవాళ ఏదైనా వెరీటీగా ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకుందామని కొందరు ఇలా అందరూ ఆన్‌లైన్‌ ఫుడ్‌మీద ఆధారపడుతున్నారు. ఇలా ఫుడ్‌ ఆర్డర్‌ చేయగానే ఆయా సంస్థలకు చెందిన డెలివరీ బోయ్స్‌ క్షణాల్లో ఫుడ్‌ ఆర్డర్‌ పట్టుకుని వారిముందు ప్రత్యక్షమవుతారు. ఎండైనా, వానైనా, గజగజా వణికించే చలైనా లెక్కచేయకుండా...

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ.. ప్రస్తుత కాలంలో దీనికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతాకాదు. వండుకునే సమయంలేక కొందరు, ఏం వండుకుంటాంలే రోజూతినేదే.. ఇవాళ ఏదైనా వెరీటీగా ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకుందామని కొందరు ఇలా అందరూ ఆన్‌లైన్‌ ఫుడ్‌మీద ఆధారపడుతున్నారు. ఇలా ఫుడ్‌ ఆర్డర్‌ చేయగానే ఆయా సంస్థలకు చెందిన డెలివరీ బోయ్స్‌ క్షణాల్లో ఫుడ్‌ ఆర్డర్‌ పట్టుకుని వారిముందు ప్రత్యక్షమవుతారు. ఎండైనా, వానైనా, గజగజా వణికించే చలైనా లెక్కచేయకుండా బైక్‌పై రయ్‌..య్‌..మంటూ దూసుకెళ్లి వారి ఆకలి తీరుస్తారు. మరి ఆఫుడ్‌ డెలివరీకి తనతోపాటు ప్రయాణించే బైకుకి కూడా ఫుడ్‌ కావాలికదా.. అది లేకపోతే బైకు ఎలా ముందుకు కదులుతుంది? పెట్రోలు ట్యాంకర్‌ డ్రైవర్ల సమ్మె పుణ్యమా అని పెట్రోలు కోసం బంకుల ముందు పెద్దసంఖ్యలో బారులు తీరుతున్నారు. అయినా పెట్రోలు దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. ఓ వైపు ఫుడ్‌ ఆర్డర్‌ డెలివరీ చేసే టైము అయిపోతోంది.. బండిలో పెట్రోలు లేదు.. ఎలా.. అందుకే జొమాటో ఫుడ్‌ డెలివరీ బోయ్స్‌ గుర్రాలను ఆశ్రయించారు. తమ ఫుడ్‌ ఆర్డర్‌ను భుజానవేసుకొని గుర్రాలపై పరుపరుగున వెళ్లి డెలివరీ చేస్తున్నారు.

ట్యాంకర్‌ డ్రైవర్ల సమ్మెతో హైదరాబాద్‌లో పెట్రోల్‌ కోసం స్విగ్గీ, జొమాటోతో పాటు పలు సంస్థలకు చెందిన డెలివరీ బాయ్స్‌ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరితో పాటు ఇతర వాహనదారులు కూడా పెట్రోల్‌ బంకుల వద్ద బారులు తీరారు. బంకుల దగ్గర భారీ క్యూ లైన్‌తో పెట్రోల్‌ కోసం ఎదురుచూడ లేక , కొన్ని చోట్ల నో స్టాక్‌ బోర్డులు దర్శనమివ్వడంతో పాతబస్తీలో స్విగ్గీ, జొమాటో బాయ్స్ గుర్రాలపై తిరుగుతూ ఫుడ్‌ను డెలివరీ చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో ట్యాంకర డ్రైవర్ల యూనియన్లు చర్చలు జరిపి సమ్మె విరమస్తున్నట్లు ప్రకటించినా కూడా అర్ధరాత్రి వరకు వాహనదారులు పెట్రోల్‌ బంకుల దగ్గర క్యూ కట్టారు. ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో కొంత ఆందోళన నెలకొన్నా.. చివరకు సమ్మె విరమస్తున్నట్లు ప్రకటించడంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలపై పునరాలోచించాలని ట్యాంకర్ డ్రైవర్లు, యజమానులు కోరారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.