దారుణం.. ట్రైన్‌లో ప్రయాణిస్తున్న యువతిపై..

Updated on: Mar 27, 2025 | 5:07 PM

సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటిఎస్ ట్రైన్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ దుండగుడు ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో కదులుతున్న ట్రైన్‌ నుంచి యువతి ఒక్కసారిగా కిందకు దూకేంది. దీంతో తీవ్ర గాయాలపాలైన యువతిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… మేడ్చల్‌లోని వసతి గృహంలో ఉంటూ ప్రైవేట్ జాబ్‌ చేస్తున్న ఓ యువతి మార్చి 22వతేదీ సాయంత్రం మేడ్చల్ రైల్వేస్టేషన్ కు వెళ్లి అక్కడి నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఆమె సెల్‌ఫోన్ రిఫేరింగ్ చేయించుకుని తిరిగి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వచ్చి ఎంఎంటీఎస్ లో మేడ్చల్ కు మహిళల కోచ్ లో బయలుదేరింది. అప్పటికే ఆ బోగీలలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు మార్గమధ్యంలోని అల్వాల్ రైల్వేస్టేషన్లో దిగిపోయారు. అనంతరం ఆ కోచ్ లో ఆమె ఒక్కతే ఉంది. ఈ క్రమంలో ఆమె వద్దకు ఓ యువకుడు వచ్చి నువ్వు కావాలి అంటూ అమెను గట్టిగా పట్టుకొని అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతడిని నుంచి తిప్పంచుకునే ప్రయత్నంలో ఆమె నడుస్తున్న రైలు నుంచి బయటకు దూకేసింది. కొంపల్లి సమీపం ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద రైలు నుంచి కిందపడి గాయాలతో ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు 108కు ఫోన్ చేసి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది ముందుగా ప్రధమ చికిత్సను అందించి అనంతరం ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. బాధితురాలు వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భర్త సొమ్ముతో ప్రియుడితో కలిసి బెట్టింగులు.. చివరికి..

రేషన్‌కార్డుదారులకు.. రేవంత్‌ సర్కార్‌ గుడ్ న్యూస్‌

విద్యార్ధులకు గుడ్‌ న్యూస్‌.. స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్నిరోజులంటే..?

Varun Tej: ఆ ట్రెండ్‌ను పట్టుకున్న వరుణ్ తేజ్‌.. మరి ఇలాగైనా సక్సెస్ అవుతారా

Ram Charan: దిమ్మతిరిగే న్యూస్ ! ఫ్యాన్స్‌కు చరణ్‌ బిగ్ సర్‌ప్రైజ్