అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. ప్రాణం తీసిన చెవినొప్పి..
మృత్యువు నీడలా వెంటే ఉంటుంది అంటుంటారు.. ఈ ఘటన చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. సమయం, సందర్భం.. వయసుతో దానికి పని ఉండదు.. క్షణాల్లో మనుషులను మాయం చేసేస్తుంది. తాజాగా అలాంటి ఘటనే జరిగింది అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో. భర్తకు ఉద్యోగం వచ్చింది.. కష్టాలు తీరిపోయాయి... ఇక హాయిగా బ్రతకొచ్చు అని కలలు కన్న మహిళ కలలు నిజం కాకుండానే ఆమెను మృత్యువు కబళించింది.
తూర్పుగోదావరి జిల్లా కేసనకుర్రుకు చెందిన రామదుర్గకు, కోనసీమ జిల్లా పోలవరానికి చెందిన విన్నకోట మోహన్‌కృష్ణతో 9 నెలల క్రితం వివాహం జరిగింది. మోహన్‌కృష్ణకు అచ్యుతాపురం సెజ్‌లో ఉద్యోగం రావడంతో దంపతులు ఇక్కడకు సమీపంలోనే ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సోమవారం రామదుర్గకు చెవి నొప్పిగా ఉండటంతో రాత్రి 7 గంటలకు భర్త ఆమెను తీసుకొని ఆసుపత్రికి బయలుదేరారు. వారి బైక్ హరిపాలెం వచ్చిన సమయంలో రామదుర్గ వేసుకున్న చున్నీ బైక్ వెనుకచక్రంలో పడి మెడను చుట్టేసింది. స్థానికులు గమనించేటప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే చున్నీని కత్తిరించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెళ్లై భర్తతో సంతోషంగా ఉందనుకున్న కూతురి అకాల మరణమతో ఆమె తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: 100 కోట్లు కొల్లగొట్టిన సర్కార్.. హాలీవుడ్ లోనూ కలెక్షన్ల రచ్చ
ఉన్న పొగ చాలు.. ఇంకా కొత్తవి ఎందుకు ?? బన్నీ- బ్రహ్మీ ట్రోల్స్ వాసు అసహనం