Bengaluru: ఆఫీసుకు వెళుతుండగా ఇస్రో సైంటిస్టుపై యువకుడి దాడి.. వీడియో వైరల్.

|

Sep 02, 2023 | 9:13 PM

బెంగళూరులో కారులో ఆఫీసుకు వెళుతున్న ఇస్రో సైంటిస్టుపై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. స్కూటీతో కారును అడ్డగించి, కారు టైర్లను తంతూ బెదిరింపులకు దిగాడు. ఇదంతా కారు డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోను ఇస్రో సైంటిస్టు ఆశిశ్ లంబా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో అది వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.

బెంగళూరులో కారులో ఆఫీసుకు వెళుతున్న ఇస్రో సైంటిస్టుపై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. స్కూటీతో కారును అడ్డగించి, కారు టైర్లను తంతూ బెదిరింపులకు దిగాడు. ఇదంతా కారు డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోను ఇస్రో సైంటిస్టు ఆశిశ్ లంబా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో అది వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఎప్పటిలాగే ఆఫీసుకు వెళుతుండగా స్కూటీపై ఓ యువకుడు రెక్ లెస్ గా ప్రయాణిస్తూ తన కారును అడ్డగించాడని చెప్పారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ కారును తన్నుతూ దాడికి యత్నించాడని ఆరోపించారు. కారులో తనతో పాటు తన కొలీగ్స్ కూడా ఉన్నారని చెప్పారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. సైంటిస్టుపై దాడికి ప్రయత్నించిన యువకుడిపై నెటిజన్లు మండిపడుతున్నారు. సదరు యువకుడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, వీడియో ఆధారంగా సదరు యువకుడిని గుర్తించే చర్యలు చేపట్టామని వివరించారు. వివరాలు అందించాలంటూ సైంటిస్టు ఆశిశ్ లంబాను రిక్వెస్ట్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..