Viral Video: కేజీ 2 రూపాయలే అనే సరికి కడుపు మండింది.. 5 టన్నుల బెండకాయలను..
తమిళనాడులో ఓ రైతు ఆవేదన గుండె తరుక్కుపోయేలా చేసింది. బెండకాయ ధర పడిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడో యువరైతు. మార్కెట్‌లో కిలో బెండకాయ రెండు రూపాయల ధర పలుకుతుండటంతో తట్టుకోలేకపోయాడు. అమ్మడం దండగ అనుకుని.. బెండకాయలన్నింటిని చెరువులో పారబోశాడు. దాదాపు ఐదు టన్నుల బెండకాయల్ని నీళ్లలో పడేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది .
ఈ కూరగాయలు పండించే రైతులకు విచిత్ర పరిస్థితి ఉంటుంది. ధర ఎప్పుడు పెరుగుతుందో తెలీదు.. అమాంతం ఎప్పుడు పడిపోతుందో తెలీదు. నిన్నమొన్నటి వరకు టమాటా ఎలా ఎగబాకిందో మనందరం చూశాం. స్థితిమంతులు ఇళ్లల్లో మాత్రమే వండే కూరగాయగా అది మారిపోయింది. పండించిన రైతులకు కోట్లు కురిపించింది. కానీ ఇప్పుడు ధర భారీగా తగ్గిపోయింది. కేజీ టమాట 10 రూపాయలకు కూడా లభిస్తోంది. టమాటా మాత్రమే కాదు.. మిగిలిన కూరగాయల ధరలు కూడా నేలముఖం చూస్తున్నాయి. బెండ పండించిన రైతుల పరిస్థితి అయితే మరీ అధ్వానంగా ఉంది. ధర కేజీ 2 రూపాయలు మాత్రమే ఉండటంతో.. కనీసం ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చులు కూడా రావడం లేదు. దీంతో తీవ్ర మనోవేదనతో ఓ రైతు దాదాపు ఐదు టన్నుల బెండకాయల్ని చెరువులో పడేశాడు. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
Published on: Sep 02, 2023 04:02 PM
వైరల్ వీడియోలు
Latest Videos