రంగు మారిన మిర్చి… ఇప్పుడు పసుపు రంగులో

|

Feb 07, 2024 | 1:55 PM

సాధారణంగా కారం ఏ రంగులో ఉంటుంది? ఎరుపు రంగులో ఉంటుంది. కానీ ప్రస్తుతం కారం రంగుకూడా మారబోతుందా అంటే అవుననిపిస్తోంది. అవును ఎండుమిర్చి రంగుమారాయి.. రంగుమారడమంటే నాసిరకం అనుకునేరు.. కానే కాదు.. వాటి సహజమైన కలరే పసుపు. ఈ పసుపురంగు మిర్చి ఖమ్మం మార్కెట్‌లో కనిపించాయి. మార్కెట్‌కు అమ్మకానికి ఓ రైతు తీసుకొచ్చాడు. వీటిని చూసి ఇతర రైతులు, వ్యాపారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సాధారణంగా కారం ఏ రంగులో ఉంటుంది? ఎరుపు రంగులో ఉంటుంది. కానీ ప్రస్తుతం కారం రంగుకూడా మారబోతుందా అంటే అవుననిపిస్తోంది. అవును ఎండుమిర్చి రంగుమారాయి.. రంగుమారడమంటే నాసిరకం అనుకునేరు.. కానే కాదు.. వాటి సహజమైన కలరే పసుపు. ఈ పసుపురంగు మిర్చి ఖమ్మం మార్కెట్‌లో కనిపించాయి. మార్కెట్‌కు అమ్మకానికి ఓ రైతు తీసుకొచ్చాడు. వీటిని చూసి ఇతర రైతులు, వ్యాపారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కొత్తరకం మిర్చిని సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు ఎత్తి రాజాపురం గ్రామానికి చెందిన భూక్యా శ్రీను అనే రైతు పండించాడు. ఖమ్మం వ్యవసాయమార్కెట్‌కు ఈ కొత్తరకం మిచ్చి అమ్మకానికి తెచ్చాడు. సుమారు 10 బస్తాల ఎల్లో మిర్చి తీసుకొచ్చాడు. సహజంగా ఎరుపు రంగులో ఉండే మిర్చి పసుపు రంగులో ఉండటాన్ని చూసి రైతులు, హమాలీలు ఆశ్యర్యం వ్యక్తం చేశారు. అయితే ఈ ఎల్లో గోల్డ్‌ మిచ్చి పంటకు డిమాండ్‌ ఎక్కువేనంటున్నాడు రైతు. ధరకూడా బాగానే పలుకుతుందని తెలిపారు. గతేడాది కూడా ఈ మిర్చి పండించాడు శ్రీను. అప్పుడు క్వింటా మిర్చి 35 వేల రూపాయలుపలుకగా ఈ ఏడాది కాస్త ధర తగ్గిందని పేర్కొన్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ నిర్మాత నన్ను దారుణంగా మోసం చేశారు.. నిజాన్ని బయటపెట్టిన హీరోయిన్

మహేష్‌ Vs ధనుష్‌ రంజుగా స్టార్ హీరోల మధ్య పోరు

రాఖీ భాయ్‌ సినిమాలో షారుఖ్.. సిల్వర్‌ స్క్రీన్‌ భగ్గుమనుడే

Eagle: గూస్ బంప్స్‌ తెప్పిస్తున్న ఈగిల్ మేకింగ్ వీడియో..

కూతురి ట్యాలెంట్‌ చూసి మురిసిపోయిన్ స్టార్ హీరో

Follow us on