నాసాలో ఎనిమిదేళ్ల సైంటిస్ట్‌.. 18 స్పేస్‌ ఆబ్జెక్ట్స్‌ను కనుగొన్న చిన్నారి.. వీడియో

|

Oct 07, 2021 | 7:54 AM

ఆడుతూ పాడుతూ సరదాగా గడిపే వయసులో ఒక అమ్మాయి అంతరిక్షంపై పరిశోధనలు చేస్తోంది. ఎనిమిదేళ్ల వయసులోనే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాతో కలిసి పనిచేస్తోంది.

ఆడుతూ పాడుతూ సరదాగా గడిపే వయసులో ఒక అమ్మాయి అంతరిక్షంపై పరిశోధనలు చేస్తోంది. ఎనిమిదేళ్ల వయసులోనే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాతో కలిసి పనిచేస్తోంది. అవును ఇది నమ్మలేని నిజం.. అంతరిక్షంలో గ్రహశకలాలను గుర్తించే ‘ఇంటర్నేషనల్‌ ఆస్ట్రోనామికల్‌ సెర్చ్‌ కొలాబరేషన్‌’ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 18 ఖగోళ వస్తువులను కూడా గుర్తించింది ఈ చిన్నారి నికోల్‌. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి చిన్న వయసున్న ఆస్ట్రోనమర్‌గా నికోల్‌ నిలిచింది. బ్రెజిల్‌లోని ఫోర్టాలెజా ప్రాంతానికి చెందిన నికోల్‌ ఒలివెరాకు చిన్నప్పటి నుంచే అంతరిక్షం అంటే ఇష్టమట. నడక నేర్చుకునే వయసులోనే ఆకాశం, గ్రహాలు, నక్షత్రాలు అంటూ పాఠాలు నేర్చుకుందట. చిన్నప్పటినుంచే విద్యార్థుల్లో సైన్స్‌ పట్ల ఆసక్తి కలిగించడం, వారే సొంతంగా కొత్త అంశాలను గుర్తించేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా కొన్నేళ్ల కింద నాసా ఒక ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: కరోనాను కట్టడి చేస్తున్న కొత్త మందు.. మాత్ర రూపంలో వస్తున్న కోవిడ్‌ మెడిసిన్‌.. వీడియో

Tabernaemontana: కంటిచూపు మెరుగు పరిచే దివ్య ఔషధం నందివర్దనం.. వీడియో

Follow us on